BigTV English
Advertisement

Bigg Boss 9 Trolls: ఇదెక్కడి రోస్ట్ మామా.. ఏకంగా పెళ్లి కూడా చేసేసారుగా?

Bigg Boss 9 Trolls: ఇదెక్కడి రోస్ట్ మామా.. ఏకంగా పెళ్లి కూడా చేసేసారుగా?

Bigg Boss 9 Trolls: బిగ్ బాస్.. ఈ షో పై వచ్చే ట్రోల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ముఖ్యంగా బిగ్ బాస్ నమ్ముకొని లక్షలు సంపాదిస్తున్న యూట్యూబర్లు కూడా లేకపోలేదు. ఆది రెడ్డిని మొదలుకొని ఎంతోమంది ఈ షో ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు బయటకు చెబుతున్న విషయం కూడా తెలిసిందే. ఇకపోతే రివ్యూలు ఇస్తూ డబ్బులు సంపాదించే వారి సంగతి పక్కన పెడితే.. ఈ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న వారిపై చేసే ట్రోల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


రోస్ట్ తగలెయ్యా.. ఏకంగా పెళ్లి చేశారు కదరా..

ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ జంటలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది కంటెంట్ కోసమే అయినా వీరి మధ్య నిజంగానే ప్రేమ ఉంది అనే రేంజ్ లో ఆ కంటెస్టెంట్స్ చేసే హడావిడి మామూలుగా లేదు. ఇదిలా ఉండగా ఇన్ని రోజులు కళ్యాణ్ , రీతు చౌదరి ప్రేమలో ఉన్నారు అని చూపించారు. మరొకవైపు కళ్యాణ్, రీతూ చౌదరి, పవన్ ట్రయాంగిల్ లో నడుపుతున్నారు అంటూ చూపించారు. అటు కామనర్ దివ్య నిఖిత హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపెట్టింది. కట్ చేస్తే కళ్యాణ్ , తనూజ కి కనెక్ట్ అయిపోయాడు.ఇక వీరిద్దరి మధ్య బంధం చూస్తే…ఎవరికైనా సరే లేనిపోని అనుమానాలు తలెత్తుతాయి అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ జంటను ట్రోలర్స్ మామూలు రోస్ట్ చేయలేదు అని చెప్పవచ్చు.

ALSO READ:Bigg Boss 9 Promo: తలరాతను మార్చే టైమ్.. హౌస్ లోకి మాజీలు.. ఎవరెవరంటే?


హాట్ టాపిక్ గా మారిన వీడియో..

ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో తెగ సంచలనం సృష్టిస్తోంది. అందులో తనూజ, కళ్యాణ్ లకు ఏకంగా పెళ్లి కూడా చేసేశారు. మిగతా హౌస్ మేట్స్ అందర్నీ పెళ్లి పెద్దలుగా చూపిస్తూ.. ప్రభాస్ , కాజల్ అగర్వాల్, తాప్సి కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలోని..” డోలు డోలు భజే ” పాటను రీ క్రియేట్ చేసి ప్రభాస్ గా కళ్యాణ్.. కాజల్ గా తనూజ ..తాప్సీగా రీతూ చౌదరిని చూపిస్తూ తెగ రోస్ట్ చేసేశారు. పైగా ఈ పెళ్లికి సంబంధించిన పాట వీడియో తెగ సంచలనం సృష్టిస్తోంది.. ఇది చూసిన నెటిజన్స్ నవ్వుకుంటున్నారు. ఇది మామూలు రోస్ట్ కాదు భయ్యో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్ మేట్స్ పై కళ్యాణ్, తనూజా పై క్రియేట్ చేసిన ట్రోల్స్ సోషల్ మీడియాలో తెగ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వీడియోని అటు నెటిజన్స్ కూడా తెగ షేర్ చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 9..

బిగ్ బాస్ సీజన్ 9 విషయానికి వస్తే.. 9 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టగా.. 7 మంది కామనర్స్ హౌస్ లోకి వచ్చారు. అలాగే మరో 6 మంది వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక వీరంతా కూడా ఎవరికి వారు తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తున్నారు ఇప్పటికే 7 వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్ ఇప్పుడు ఎనిమిదవ వారం కూడా మొదలయ్యింది.

?utm_source=ig_web_copy_link

Related News

Bigg Boss 9: పాపం పచ్చళ్ల పాప.. ఎన్ని కలలు కంది.. ఈ ట్రోల్స్ ఎక్కడ చూడలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: తలరాతను మార్చే టైమ్.. హౌస్ లోకి మాజీలు.. ఎవరెవరంటే?

Bigg Boss Buzzz : రీతూ పై రమ్య షాకింగ్ కామెంట్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శివాజీ..

Bigg Boss 9 : ట్విస్ట్లుతో రమ్య ఎలిమినేషన్, మరోసారి ఎవరు ఎలాంటి వాళ్ళు తేల్చి చెప్పేసింది. 

Ramya Moksha: మాదే మిస్టేక్, నచ్చిన ఫుడ్ పెడుతున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది రెండు వారాల్లో బయటకు తగిలేస్తారని

Bigg Boss 9 : ఏమి మేనేజ్మెంట్ సామీ, కంప్లీట్ సపోర్ట్ అంతా తనూజ కేనా?

Bigg Boss 9 Promo: పచ్చళ్ల పాపకి ఆ మాత్రం కూడా తెలీదా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్!

Big Stories

×