Delhi Acid Attack: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై యాసిడ్ దాడి చేశాడు ఓ యువకుడు. ఈ ఘటనలో యువతి ముఖం, చేతులకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.
ఢిల్లీలో దారుణమైన ఘటన
ఢిల్లీలోని అశోక్ విహార్‌లో 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని యాసిడ్ దాడి జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగిన ఈ ఘటన కళాశాలకు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినిపై యాసిడ్ పోసి పారిపోయారు. ఈ దాడిలో యువతి ముఖం, చేతులకు గాయాలు అయ్యాయి. వెంటనే బాదితురాలిని RML ఆసుపత్రిలో తరలించారు.
ప్రస్తుతం యువతి చికిత్స పొందుతోంది. బాధితురాలి ఆరోగ్యం నిలకడగాని ఉందని, త్వరలో డిశ్చార్జ్ చేస్తారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తి పేరు జితేందర్.
డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి
యువతికి తెలిసిన వ్యక్తేనని, ఇద్దరు ముకుందపూర్ నివాసితులని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు జితేందర్ పరారీలో ఉన్నాడని అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జితేందర్‌తోపాటు తన సహచరులు ఇషాన్, అర్మాన్‌లతో కలిసి బైక్‌పై వచ్చాడు. ఇషాన్, అర్మాన్‌లకు యాసిడ్ బాటిల్ ఇచ్చాడని, మరొక బాటిల్ జితేందర్ పట్టుకుని యువతిపై పోసినట్టు తెలుస్తోంది.
బాధితురాలు తన ముఖాన్ని రక్షించుకోవడానికి చేతిలోని బ్యాగ్ పెట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె రెండు చేతులు, ముఖానికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. జితేందర్ దాదాపు ఏడాదిగా యువతిని వేధిస్తున్నాడని, నెల కిందట వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తేలింది.
ALSO READ: లా విద్యార్థిపై కిరాతక దాడి, చేతి వేళ్లు నరికేసి
ఢిల్లీ యూనివర్సిటీలోని లక్ష్మీబాయి కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది బాధితురాలు. ప్రధాన నిందితుడు జితేందర్‌కు వివాహం జరిగింది. ఏడాదిన్నర కూతురు కూడా ఉందని ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఆర్యన్ తెలిపాడు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశాడు.
డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి..
దేశ రాజధాని ఢిల్లీలో ఘటన
కాలేజీకి వెళ్తుండగా బైక్‌పై వచ్చి యాసిడ్ పోసి పరారైన ముగ్గురు యువకులు
యువతి రెండు చేతులకూ తీవ్ర గాయాలు
నిందితుల కోసం పోలీసుల గాలింపు pic.twitter.com/npDK3pMTAX
— BIG TV Breaking News (@bigtvtelugu) October 27, 2025