Prabhas: రోజురోజుకి ఏఐ టెక్నాలజీ ఎంత అప్డేట్ అవుతుంది అంటే.. ఇంకొన్నిరోజులు పోతే అసలు మనుషులను కూడా మర్చిపోతారేమో అనిపించకమానదు. సోషల్ మీడియా చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఏది నిజం.. ఏది ఏఐ అనేది కూడా పోల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక ఏఐని ఉపయోగించి కొందరు సినిమాలు కూడా తీసేస్తున్నారు. దీనివలన టెక్నీషయన్స్ కి, హీరోహీరోయిన్లకు పని లేకుండా పోతుంది అని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, మరికొంతమంది ఆ టెక్నాలజీనే ఉపయోగించి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.
ఇక ఈ ఏఐ టెక్నాలజీ ఇండస్ట్రీలో ఎవరికి ఎక్కువ ఉపయోగపడిందో తెలియదు కానీ, ప్రభాస్ కి మాత్రం బాగా గట్టిగా ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. అన్ని పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. ఇక ఒక్కో సినిమాలో ఒక్కో లుక్ లో కనిపించాలి. బాహుబలి టీమ్ గెట్ టుగెదర్ ఈవెంట్ లో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అదేంటీ డార్లింగ్ లుక్ అంత మారిపోయింది అని ఆశ్చర్యపోయారు.
బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం ఈ టీమ్ అంతా మళ్లీ కలిసింది. అప్పుడు ప్రభాస్ లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంది.. అబ్బా ఏమున్నాడ్రా బాబు అని అనిపించాడు. ఇక అదే లుక్ తో మళ్లీ బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్ లో కనిపించాడు. తాజాగా డార్లింగ్.. బాహుబలి ది ఎపిక్ గురించి మాట్లాడుతూ ఒక వీడియో చేశాడు. అందులో ప్రభాస్ మాట్లాడుతూ.. ” బాహుబలి ది ఎపిక్ సినిమాను థియేటర్ లో చూడండి. రెండు భాగాలను కలిపి రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 31 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది” అని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ వీడియోలో ప్రభాస్ ఒరిజినల్ కాదు అనేది కొందరు వాదన. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ప్రభాస్ అని, ఒరిజినల్ ప్రభాస్ ఇలా లేడు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మొన్నటికి మొన్న స్పిరిట్ ఆడియోలో కూడా అది ప్రభాస్ వాయిస్ కాదని, లాస్ట్ మినిట్ లో డార్లింగ్ వాయిస్ యాడ్ చేయాల్సి వస్తే.. ఏఐ సహాయం తీసుకున్నారని సమాచారం. ఇక ఇప్పుడు జక్కన్న కూడా అదే చేశాడని అంటున్నారు. అరేయ్ ఎంత మోసం చేస్తున్నారా అని కొందరు అంటున్నారు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం.. ఇది ప్రభాస్ నే.. కనీసం ఆ తేడా కూడా తెలుసుకోలేకపోతున్నారా అని మండిపడుతున్నారు. మరి ఇందులో ఏది నిజం అనేది మేకర్స్ కు మాత్రమే తెలియాలి.
The King returns! 👑
Our BAAHUBALI, #Prabhas invites you back into the world of Maahishmati ❤️🔥❤️🔥❤️🔥
For the first time ever, witness both parts of this legendary saga united as One Epic Film. #BaahubaliTheEpic releasing on October 31st. 🔥
International Premieres on Oct 29th💥… pic.twitter.com/isCpP2xW0t
— Baahubali (@BaahubaliMovie) October 26, 2025