Kingdom : ప్రస్తుతం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కింగ్డమ్. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి రేపు మార్నింగ్ ఈ సినిమా విడుదల కానుంది. ఈ తరుణంలో సినిమా బుకింగ్స్ బీభత్సంగా ఉన్నాయి. ఈ సినిమా కంటెంట్ మీద చాలామందికి విపరీతమైన నమ్మకం ఉంది.
ఈ సినిమాకి ఎక్కువ హైప్ తీసుకొచ్చింది నిర్మాత నాగ వంశీ. సినిమా మొదలు పెట్టిన అప్పటి నుండే విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాడు. ఈ సినిమా విషయంలో ఎటువంటి రివ్యూలు వచ్చిన నేను యాక్సెప్ట్ చేస్తాను అంటూ అప్పట్లో తెలిపాడు నాగ వంశీ. విజయ్ కూడా ఒక హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. ఈ సినిమాతో విజయ్ మంచి కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది ఎదురుచూస్తున్నారు.
సినిమా డ్యూరేషన్ ఎంతంటే.?
ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు రెండు భాగాలుగా స్క్రిప్ట్ రాశాడు గౌతం. నాగ వంశీకి చెప్పినప్పుడు కూడా అదే చెప్పాడు. అయితే ఈ సినిమా రెండు భాగాలు అయినా కూడా కింగ్డమ్ సినిమాకి ప్రాపర్ స్టార్టింగ్ మరియు ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది అని ముందే చెప్పాడు నాకు వంశీ. ఈ సినిమా డ్యూరేషన్ విషయానికి వస్తే ప్రధమార్ధం గంట 26 నిమిషాలు, ద్వితీయార్థం గంట తొమ్మిది నిమిషాలు. మొత్తం ఈ సినిమా డ్యూరేషన్ రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉండనుంది. ఒకరకంగా సినిమా కోసం పర్ఫెక్ట్ డ్యూరేషన్ కట్ చేశారు అని చెప్పాలి. ఈ సినిమా టాక్ బాగుంటే కలెక్షన్లు బీభత్సంగా వస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే బుకింగ్స్ ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి.
చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్
ఈ సినిమా గురించి మూవీ యూనిట్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది అంటూ అనిరుద్ తెలిపాడు. అలానే తనక్కూడా పెద్ద ప్లస్ అవ్వనున్నట్లు కూడా చెప్పాడు అనిరుద్. ఈ సినిమాకి కూడా అనిరుద్ మంచి ప్లస్ అయ్యాడు. ముఖ్యంగా అనిరుద్ అందించిన మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన మ్యూజిక్ తో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా విషయంలో నవీన్ నూలి ఎడిటింగ్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది అని నాగ వంశీ పలు సందర్భాల్లో తెలిపాడు. మొత్తానికి నాగవంశీ కాన్ఫిడెంట్ కి రేపటితో తెరపడనుంది. విజయ్ కం బ్యాక్ కూడా రేపే తేలిపోతుంది.
Also Read: Coolie Event : కూలీ సినిమా ఈవెంట్ ఫిక్స్, చాలా ఏళ్ల తర్వాత తలవైర్ ఎంట్రీ