Coolie Event : ప్రస్తుతం సౌత్ సినిమా ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కూలీ. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేశాడు అనిరుద్. అనిరుద్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చూడ్డానికి బక్కగా కనిపించిన మ్యూజిక్ మాత్రం బలంగా ఉంటుంది.
ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలానే తెలుగులో ప్రముఖ నిర్మాతలు ముగ్గురు కలిసి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు.
కూలీ ఈవెంట్ అప్పుడే
కూలీ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ గురించి ఒక తరుణంలో నాగవంశీ కూడా పోటీపడ్డారు. అయితే అది వర్కౌట్ కాకపోవడంతో వార్ 2 సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాడు. అయితే మరోవైపు కూలీ సినిమాకు అంత పోటీ ఉండడంతో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 4న నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ అంతా కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ ఈవెంట్ కి వస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
రజనీకాంత్ తెలుగు ఈవెంట్ కి హాజరై చాలా రోజులైంది. ఈ సినిమాతో హాజరవుతున్నారు అంటే అందరికీ అంచనాలు మరింత పెరిగాయి. మామూలుగా అయితే కొన్ని సినిమాలకు తమిళ దర్శకుడు, సంగీత దర్శకుడు కొంతమంది తెలుగు హీరోలు గతంలో హాజరై ఈవెంట్ ఫినిష్ చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కూలీ టీం రంగంలోకి దిగుతుంది అంటే ఇది కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది.
హైప్ పెరుగుతుంది
ఈ సినిమా మీద విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అక్కినేని నాగార్జున, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, అలానే మలయాళం స్టార్ సౌబిన్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) వంటి నటులు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఇంతమంది క్యారెక్టర్స్ ను ఈ సినిమా కోసం లోకేష్ ఎలా డిజైన్ చేసి ఉంటాడా అని అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. వాటన్నిటికీ కూడా ఆగస్టు 14న సమాధానం దొరుకుతుంది. కూలీ ఏ రేంజ్ హిట్ అవుతుందో వేచి చూడాలి. ఈ ఈవెంట్ కు నాగర్జున (Nagarjuna) ఎలానో హాజరవుతారు. తనతో పటు సీనియర్ హీరోలు ఎవరైనా హాజరవుతారేమో వేచి చూడాలి.
Also Read : The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పనట్లే, అనౌన్స్ చేసిన డేటుకు రిలీజ్ కష్టమేనా ?