Jana nayagan: ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దళపతి.. ఎట్టకేలకు తొలి ప్రయత్నంలోనే ఊహించని మెజారిటీతో తమిళనాడులో ముఖ్యమంత్రిగా అవతరించి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు అధికారంలోకి వచ్చిన తర్వాత పలు రంగాలలో మార్పులు చేర్పులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇకపోతే విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టకు ముందు చేసిన చిత్రం జననాయగన్. ఈ ఏడాది ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో పాటే ఈ సినిమాని కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ సెన్సార్ కారణాలవల్ల కోర్టు చుట్టూ తిరుగుతూ ఈ సినిమా దాదాపు 7 నెలల పాటు వాయిదా పడింది.
ఇక మధ్యలో అనుకోకుండా జననాయగన్ సినిమా మొత్తం లీకై సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇకపోతే పలు మార్పులు, చేర్పులు చేసి ఇప్పుడు ఎట్టకేలకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.. వాస్తవానికి జూలై 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ.. ఒకరోజు ముందుగానే అనగా జూలై 23వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా రాబోతున్న ఈ చిత్రం పై ఇప్పుడు అంచనాలు పెరగడానికి కారణం నిర్మాత వెంకట్ కె నారాయణ చేసిన కామెంట్లే అనే చెప్పాలి.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత వెంకట కే నారాయణ మాట్లాడుతూ జననాయగన్ సినిమా పైరసీకి గురై లీకైన తర్వాత జరిగిన క్లైమాక్స్ మార్పు పై ఆయన వివరణ ఇచ్చారు. “మా హీరో ముఖ్యమంత్రి అయ్యాడు .తమిళనాడు సీఎం గా బాధ్యతలు చేపట్టడం నిజంగా ఒక డెస్టినీగా భావిస్తున్నాము. విజయ్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ కావడం ఈ ట్విస్ట్ తో కూడిన క్లైమాక్స్ గా మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ను పూర్తిగా మార్చేశాం..
also read:జిగేలు రాణిలా మెరిసిపోతున్న రాశిఖన్నా.. హీట్ పుట్టించే లుక్స్ తో!
లీకైన సినిమాకు సంబంధం లేకుండా.. ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది. ముగింపు చాలా గ్రాండ్ గా, కొత్తగా డిజైన్ చేశాము. ఈ సినిమాలో కొత్తగా చేర్చిన 41 సెకండ్ల సన్నివేశానికి రీ సెన్సారింగ్ కూడా చేశారు . క్లైమాక్స్ చివర్లో విజయ్ కొత్త అవతారంలో ఎంట్రీ ఇచ్చే ట్విస్ట్ అభిమానులకు ఒక పండుగలా ఉంటుంది. అంటూ ఓ రేంజ్ లో ఆయన కామెంట్లు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య నిర్మాత చేసినట్లు వినిపిస్తున్న కామెంట్లు సినిమాపై ఊహించని బజ్ క్రియేట్ చేశాయి.
ఇకపోతే ఈ సినిమాలో మమిత బైజు, పూజా హెగ్డే, బాబి డియోల్, ప్రకాష్ రాజ్ , ప్రియమణి , గౌతమ్ వాసుదేవ్ మీనన్, రెబా మోనిక జాన్, సునీల్ , బాబా భాస్కర్, రేవతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.