E-Paper
Advertisement

తండ్రి చాటు సీఎం అభ్య‌ర్థి! యోగ్యం ఉందా లేదా..? ఇప్ప‌టికే మూడు సార్లు మిస్సింగ్‌…..

తండ్రి చాటు సీఎం అభ్య‌ర్థి! యోగ్యం ఉందా లేదా..? ఇప్ప‌టికే మూడు సార్లు మిస్సింగ్‌…..
Advertisement

కేటీఆర్‌ను సీఎం చేయ‌డ‌మే కేసీఆర్‌కున్న ఏకైక జీవిత ల‌క్ష్యం. ఆయ‌న రాజ‌కీయ జీవిత చ‌రమాంకంలో ఇదొక్క‌టి సాధించి త‌రువాత శాశ్వ‌తంగా రాజ‌కీయాల‌కు దూర‌మైనా స‌రే.. అనే భావ‌న‌లో ఉన్నాడు. త‌న అంత‌ర్గ‌త మిత్రుల‌తో .. అత్యంత స‌న్నిహితుల‌తో ఆయ‌న చెప్పుకునే మాట ఇదే.

ఇప్పుడీ టాపిక్ ఎందుకొచ్చిందంటే.. కేటీఆర్ మొన్న ఓ మాట‌న్నాడు. బీఆరెస్ గెలిస్తే కేసీఆర్ సీఎం అవుతాడు… కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సీఎం అవుతాడు..! మ‌రి సీఎం క్యాండిడేట్ ఎవ‌రో కూడా తెలియకుండా.. అస‌లు ఆ క్యాండేటే లేకుండా బీజేపీ ఎట్లా అధికారంలోకి వ‌స్తుంది? అని.

Advertisement

ప్ర‌శ్న బాగానే ఉంది. బీజేపీ నేత‌లు దీనిపై చ‌ర్చించుకోవాలి కూడా. స‌ఖ్య‌త పెంచుకోవాల్సిన అనివార్య‌తను కూడా కేటీఆర్ వ్యాఖ్య‌లు తెలియ‌జేశాయి. ఇప్పుడు ఇది కాదు ముచ్చ‌ట‌.. కేసీఆర్ సీఎం అనేది పైకి చెప్పే మాటే.. కానీ బీఆరెస్ గెలిస్తే.. వెంట‌నే కేసీఆర్ చేసే ప‌నేంటో తెలుసా? వెంట‌నే కేటీఆర్‌ను సీఎంను చేయ‌డం.

ప‌దేండ్ల పాల‌న‌లో ముచ్చ‌ట‌గా ఆయ‌న మూడు సార్లు కేటీఆర్‌ను సీఎం చేయాల‌ని ట్రై చేశాడు. కానీ ప‌రిస్థితులు అనుకూలించ‌లేదు. సోనియా గాంధీ .. రాహుల్ విష‌యంలో చేసిన పొర‌పాటు తాను చేయ‌బోన‌ని కేసీఆర్ చాలా సార్లు చెప్పుకున్నాడు. ఒక్క‌సారి రాహుల్‌ను ప్ర‌ధాని చేసి ఉంటే.. ఓడినా మాజీ ప్ర‌ధాని హోదాలో.. రాజ‌కీయాల్లో బ‌లంగా చెలామ‌ణి అయి ఉండేవాడ‌ని ఆయ‌న ఉవాచ‌.

Advertisement

అందుకే కేటీఆర్‌ను ఒక్క‌సారి సీఎం చేస్తే.. ఇక త‌న పని ముగుస్తుంద‌ని, అది నిల‌బెట్టుకుంటాడా? పోగొట్టుకుంటాడా? త‌నే చూసుకుంటాడ‌నే దోర‌ణిలో ముందుకు సాగాడు కేసీఆర్‌. ఇప్పుడు ఆ పార్టీ మొత్తం.. కేసీఆర్ సీఎం అంటుంది. జ‌నం కూడా కేసీఆర్ వైపే ఉంటారు త‌ప్ప‌.. ఒక‌వేళ కేటీఆర్ సీఎం అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల్లోకి పోతే అంతా తుస్సుమంటుంద‌ని వారికి తెలుసు.

అందుకే కేటీఆర్ కూడా సీఎంగా కేసీఆర్‌.. కేసీఆర్ సీఎం… అని జ‌నాల‌కు ఫీడ్ బ్యాక్ ఇస్తున్నాడు. ఈసారి క‌చ్చితంగా ఎలాగోలా బీఆరెస్‌ను ఒంటిచేత్తో గెలిపించి.. ఆ వెంట‌నే తెలంగాణ‌కు కేటీఆర్‌ను సీఎం చేయాల‌నేది కేసీఆర్ స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం. ఇది దాదాపు అంద‌రికీ తెలుసు. కానీ బ‌య‌ట‌కు చెప్ప‌రు. అంతే కొంద‌రి జాత‌కాలు..అంతే!

నేరుగా ప‌ద‌వీయోగ్య‌త ఉండ‌దు.. ఇలా తండ్రి చాటుగా.. పేరొక‌రిది ఊరొక‌రిది టైపు..గా వ‌స్తే గానీ ప‌ద‌వీ యోగ్యం దొర‌క‌దు. ఇప్పుడు ఇదే చేస్తున్నారు బీఆరెస్‌లో. ఆ ప‌దేండ్ల‌లో కేటీఆర్ ఏం త‌క్కువ చెలాయించుకున్నాడా? ఆయ‌నో షాడో సీఎం. కానీ ఇది చాల‌దుగా. సీఎంగా కుర్చీ ఎక్కి.. తెలంగాణ రాష్ట్ర చ‌రిత్ర‌లో సీఎంల పేర్ల లిస్టులో క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు.. తెలంగాణ ముఖ్య‌మంత్రి.. అని లిఖించ‌బ‌డి ఉండాలె. అది క‌దా అస‌లు కోరిక‌. ఇది క‌దా ఆ పెద్దాయ‌న చివ‌రి కోరిక‌.

Related News

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

పుష్కరకాలంలో యువత యూటర్న్‌..! మోడీ అప్పుడు కొత్త ఓటర్ల పాలిట హీరో..! అందుకే నెత్తినెత్తుకున్నారు.. ఇప్పుడెందుకు వైఖరి మారింది? సీఎస్‌డీఎస్‌ ఆసక్తికర విశ్లేషణ..!

ఉద్యమాల ఆయువుపట్టు మీద పాలకుడి దాడి! ప్రశ్నించే గొంతులకు వేదిక లేకుండా చేసే కుయుక్తులు..! ధర్నాచౌక్‌లకు తాళాలేయడం.. రోగానికి మందు కాదు..!

హస్తిన పోరులో తెలంగాణ కీ రోల్‌! రేవంత్‌పై భారీ నమ్మకం పెట్టుకున్న ఏఐసీసీ! ఢిల్లీ పోరులో టీ కాంగ్రెస్‌ హవా!

తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!

Big Stories

Advertisement
×