E-Paper
Advertisement

Vijay Sethupathi: మహారాజా సీక్వెల్ పై విజయ్ క్లారిటీ.. మాస్ అభిమానులకు మంచి ఫీస్ట్!

Vijay Sethupathi: మహారాజా సీక్వెల్ పై విజయ్ క్లారిటీ.. మాస్ అభిమానులకు మంచి ఫీస్ట్!
Advertisement

Vijay Sethupathi:ఒకవైపు హీరోగా.. మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్గా పలు చిత్రాలలో నటిస్తూ తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్నారు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) . అలాంటి ఈయన తన కెరియర్లో 50వ చిత్రంగా ‘మహారాజా’ సినిమా చేసి.. సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించారు. సాధారణ కథతో మొదలైన ఈ సినిమా వెండితెరపై ఊహించని మలుపులతో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి ఆధ్యంతం ఆకట్టుకుంది . అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు విజయ్ సేతుపతి సినిమా కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది

మహారాజా సీక్వెల్ పై విజయ్ సేతుపతి క్లారిటీ..

ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఇటు ఓటీటీలలో కూడా అత్యధిక వ్యూస్ రాబట్టి సత్తా చాటింది. గత ఐదేళ్లలో వచ్చిన అత్యుత్తమ ఇండియన్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. అలాంటి సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అభిమానులకు ఒక తీపి శుభవార్తను తెలియజేశారు విజయ్ సేతుపతి. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ విషయంపై విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ” డైరెక్టర్ నిథిలన్ సామినాథన్ సీక్వెల్ కి సంబంధించిన స్టోరీ లైన్ నాతో చెప్పాడు. అది చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా పూర్తిస్థాయి స్క్రిప్ట్ వినడానికి నేను చాలా ఆత్రుతగా ఉన్నాను.. మొదటి భాగంలో తండ్రి కూతుర్ల సెంటిమెంటుతో పాటు సాగిన మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్.. రెండో భాగంలో మరిన్ని ఇంటెన్స్ ట్విస్టులతో ఉండబోతోంది” అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక స్వయంగా విజయ్ సేతుపతి ఈ సినిమా సీక్వెల్ పై స్పందించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో విశేష ఆదరణ..

Advertisement

ఇకపోతే మహారాజా సినిమా ఇండియాలోనే కాకుండా చైనా, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఇక అసలే వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న విజయ్ సేతుపతికి ఈ సినిమా మళ్లీ అదే స్థాయి గుర్తింపును అందిస్తుందని.. కథనంలో మరిన్ని ట్విస్ట్ లు సినిమా ప్రేక్షకుడికి మరింత వినోదాన్ని పంచనున్నాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ పై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.

ALSO READ:Vijay Sethupathi: విక్రమ్ ఇంట్రడక్షన్ సీన్ పై భయపడ్డ విజయ్.. లోకేష్ ఏం చేశారంటే?

విజయ్ సేతుపతి తదుపరి చిత్రాలు..

Advertisement

విజయ్ సేతుపతి తదుపరి చిత్రాల విషయానికి వస్తే … చివరిగా ‘గాంధీ టాక్స్’ లో నటించిన ఈయన ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘స్లమ్ డాగ్ :33 టెంపుల్ రోడ్’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మరో రెండు తమిళ్ చిత్రాలను లైన్ లో పెట్టారు విజయ్ సేతుపతి. దీనికి తోడు ఇప్పుడు మహారాజా సీక్వెల్ తో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని ప్రకటించడంతో అభిమానులకు మంచి ఫీస్ట్ మళ్లీ దొరకబోతోందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Related News

సాయి పల్లవి కోసం.. ‘రామాయణ్’ సాంగ్‌లో ఆ నటిని బ్లర్ చేశారా?

ఫాహ్.. ఈ ఫన్నీ సౌండ్‌కు స్ఫూర్తి కమెడియన్ వేణు మాధవ్?

ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక..ఆమె ఫస్ట్ రియాక్షన్ ఇదే!

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన కియారా సిద్దార్థ్ మల్హోత్రా!

పూర్తి అబ్బాయిగా మారిన స్నిగ్ధ.. గర్ల్ ఫ్రెండ్ కూడా?

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కు బిగ్ షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు!

టికెట్ ధరల పెంపు.. సినిమాకే నష్టం.. నిర్మాతలు ఆలోచించండి!

ఇట్స్ అఫీషియల్ వాయిదా పడిన ప్రశాంత్ నీల్ ‘418’ ..కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×