Raja Saab : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. గత ఏడాది కల్కి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న డార్లింగ్ నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా ఇంకా రాలేదు.. ఆయన అభిమానులు రాజా సాబ్ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అదిగో ఇదిగో అంటున్నారు తప్ప రిలీజ్ ఎప్పుడు అవుతుందో అన్న విషయాన్ని కన్ఫామ్ గా చెప్పలేదు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమాను జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. జనవరిలో సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… మరి ఈ సినిమాకు తమిళనాడులో గట్టి పోటీ ఏర్పడేలా ఉందని తెలుస్తుంది. ఏ హీరో సినిమా రిలీజ్ కాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..
హీరో ప్రభాస్ నటించిన రాజా సబ్ మూవీని స్క్రీన్ మీద ఎప్పుడు ఎప్పుడు చూస్తామని ఆయన అభిమానులతో పాటుగా సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ మొత్తానికి రిలీజ్ డేట్ లాక్ చేశారు. జనవరి 9న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నారు.. ఈ సినిమాతో పాటు సంక్రాంతికి తెలుగులో చాలా రిలీజ్ లు ఉన్నాయి. మన శంకర వర ప్రసాద్, రవితేజ 76వ సినిమా, శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమాలు ప్రభాస్ రాజా సాబ్ కి పోటీ వస్తున్నాయి.. అయితే ఇప్పటివరకు ఈ సినిమాల మీద అంత బజ్ లేదు కానీ… సంక్రాంతి రిలీజ్ కాబోతున్న సినిమాలు పై అంచనాలు పెరుగుతున్నాయి.. విజయ్ దళపతి నటిస్తున్న ‘జన నాయగన్’ వస్తుంది. విజయ్ చివరి సినిమా అవ్వడం వల్ల ఈ మూవీపై ఫ్యాన్స్ చాలా క్రేజీగా ఉన్నారు.. ఎటోచ్చిన తమిళనాడులో రాజా సాబ్ సినిమాకి కాస్త కష్టమని అనిపిస్తుంది..
Also Read :ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాల సందడి..మూవీ లవర్స్ కు పండగే..!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎప్పుడు తన చేతిలో అరడజనుకు పైగా సినిమాలను పెట్టుకుంటాడు. ఒక సినిమా లైన్ లో ఉండగానే మరో రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఈమధ్య ఎక్కువగా ప్రభాస్ కొత్త సినిమాలు మీద ఫోకస్ చేస్తున్నాడు తప్ప.. సెట్స్ మీద ఉన్న సినిమాలని కంప్లీట్ చేయాలనే ఆలోచనలో లేడు అంటూ ఆయన అభిమానులు నిరాశలో ఉన్నారు.. ఇప్పటికే ఏప్రిల్ లోనే రాజా సాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అది పోస్ట్ పోన్ అవుతూ మొత్తానికి వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లోకి రాబోతుంది. ఈ సినిమా తర్వాత హనురాఘవ పూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమాల తర్వాత కల్కి 2, సలార్ 2 సినిమాల్లో నటిస్తున్నాడు. మొత్తానికి మరో రెండేళ్లు డోకా లేకుండా ప్రభాస్ కొత్త సినిమాలను లైన్లో పెట్టుకున్నారు. మరి ఏ సినిమా ముందుగా అభిమానులను పలకరిస్తుంది? ఆయన చేస్తున్న సినిమాలలో ఏ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి..