Rashmika Mandanna: రష్మిక మందన్న (Rashmika Mandanna).. విజయ్ దేవరకొండ.(Vijay Deverakonda). ఇండస్ట్రీలో ఎవరికి వారు తమకంటూ ఒక హోదాను క్రియేట్ చేసుకున్నారు. అలా ఇద్దరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నటించిన చిత్రం ‘గీతా గోవిందం’. ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్ కు మంచి హిట్ అందించింది. అంతేకాదు హిట్ పెయిర్ అంటూ ముద్ర కూడా వేయించుకుంది. అప్పటినుంచి వీరిద్దరూ ఎక్కడ కనిపించినా సరే వీరిద్దరిపై మీడియా కూడా స్పెషల్ ఫోకస్ పెట్టేది. దీనికి తోడు వెకేషన్స్ కి వెళ్లడం, ఎక్కువగా విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ఏ చిన్న అకేషన్ కైనా రష్మిక హాజరవడం.. ఇలా ఎన్నో విషయాలు వీరిద్దరి మధ్య బంధాన్ని నిరూపించాయి. దీనికి తోడు అటు సినిమా ఈవెంట్లలో కూడా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో “నువ్వు నా ఫ్యామిలీ రా” అంటూ రష్మిక బహిరంగంగా చేసిన కామెంట్లు పలు అనుమానాలకు దారితీసాయి.
ఇటీవల జరిగిన న్యూయార్క్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో కూడా వీరిద్దరికీ ప్రత్యేక ఆహ్వానం అందింది. అక్కడ జంటగా కనిపించి మరింత అనుమానాలు రేకెత్తించారు. ఇదిలా ఉండగా.. గత కొద్దిరోజుల క్రితం రష్మిక – విజయ్ దేవరకొండ లకు నిశ్చితార్థం అయిపోయిందని.. త్వరలోనే పెళ్లి అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు ఈ విషయాలపై రష్మిక క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ.. “నేను పెట్టుకున్నది జస్ట్ నా సెంటిమెంట్ ఉంగరం మాత్రమే. నాకు ఎవరితో కూడా ఎంగేజ్మెంట్ జరగలేదు. ఒకవేళ నేను ఎవరితోనైనా నిశ్చితార్థం చేసుకొని ఉంటే కచ్చితంగా ఆ విషయాన్ని స్వయంగా చెబుతాను.. అప్పటివరకు ఎవరు ఎలాంటి రూమర్లు నమ్మకండి” అంటూ క్లారిటీ ఇచ్చింది రష్మిక మందన్న. అయితే ఇక్కడ విజయ్ తో తన రిలేషన్ పై డైరెక్ట్ గా కామెంట్లు చేయలేదు. మొత్తానికైతే ఎంగేజ్మెంట్ అంటూ వస్తున్న వార్తలకు ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది.
మైత్రి బ్యానర్ లో హ్యాట్రిక్ మూవీ..
ఇదిలా ఉండగా.. రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ కలసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హ్యాట్రిక్ మూవీ గా రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఈ జంటకు మరింత పేరు తీసుకురావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ALSO READ:Tamannaah: అలాంటి వాడే భర్తగా రావాలంటున్న మిల్కీ బ్యూటీ.. అందుకే లవ్ ఫెయిల్యూరా?
రష్మిక మందన్న సినిమాలు..
రష్మిక సినిమాల విషయానికి వస్తే.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న ఈమె.. ఒకవైపు హీరోయిన్గా చేస్తూనే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు ఇప్పుడు హారర్ జానర్ లో సినిమాలు చేయడానికి కూడా సిద్ధమయ్యింది రష్మిక మందన్న . అందులో భాగంగానే థామా, కాంచన 4 వంటి చిత్రాలలో నటిస్తోంది. అలాగే గర్ల్ ఫ్రెండ్, ది రెయిన్బో వంటి చిత్రాలు కూడా ఈమె జాబితాలో ఉన్నాయి.
విజయ్ దేవరకొండ సినిమాలు..
విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు రష్మిక తో కొత్త సినిమా చేయబోతున్నారు.