OTT Movies: థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు అక్కడ రెస్పాన్స్ ని బట్టి ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. భారీ ప్రాజెక్టులుగా ఉంచుతున్న సినిమాలుకు ముందుగానే డిజిటల్ హక్కులను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఒక హీరో సినిమా రాబోతుంది అంటే ఆ సినిమాకు సంబంధించిన అన్ని రైట్స్ ముందుగానే డీల్ కుదుర్చుకుంటున్నాయి. బిజినెస్ ను బట్టి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ని అందుకోకపోయినా సరే ఓటీటీలో మాత్రం పాజిటివ్ టాక్ ను అందుకుంటున్నాయి. ప్రతి వీకెండ్ కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. మరి ఈ వీకెండు ఎలాంటి సినిమాలు సందడి చేయబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
ప్రముఖ టాప్ ఓటిటి సంస్థల్లో ఒకటేనా అమెజాన్ ప్రైమ్ వీడియో నిత్యం ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ప్రతివారం బోలెడు సినిమాలు రాబోతుంటాయి. ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో కూలీ కూడా ఉంది. రజనీకాంత్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకుపైగా వసూల్ చేస్తుంది.. టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా సినిమా కూడా ఇందులో స్ట్రీమింగ్ అవుతుంది. కామెడీ మూవీ బకాసుర రెస్టారెంట్ కూడా ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అదే విధంగా.. తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ జన్మ నచ్చతిరమ్, మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మీషా, అలాగే కన్నడ సినిమా అన్న కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సయ్యారా స్ట్రీమింగ్ కు వచ్చింది.. 500 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ రొమాంటిక్ సినిమా ఇందులో స్ట్రీమింగ్ అవుతుంది. వీటితో పాటుగా మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు వెబ్ సిరీస్ కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ కూడా బోలెడు సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతుంది. ఈవారం బోలెడు సినిమాలు జియో లోనే రిలీజ్ అవుతున్నాయి. వీకెండ్ కూడా కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. కన్నడ బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ సు ఫ్రమ్ సో ఈ వారమే స్ట్రీమింగ్ కు వచ్చింది.. ఈ సినిమాతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రాంబో ఇన్ లవ్ వచ్చింది. రాంబాబు అనే కార్పొరేట్ యువకుడు, అతని మాజీ లవర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది…
ప్రేక్షకులకు కొత్త సినిమాలను అందించడంలో ఆహా ఎప్పుడు ముందుంటుంది. ఎప్పటికప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలను తమ యూజర్స్ కి అందించేందుకు ఆహా కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. పెద్ద ఓటీటీ సంస్థలతో పోటీ పడుతూ సినిమాలను అందిస్తుంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ఇక్కడ స్ట్రీమింగ్అయ్యేందుకు వచ్చేసాయి.. ఈ వారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. తమిళం ఓటీటీలో వెంబు అనే తమిళ రూరల్ డ్రామా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీతోపాటు మలయాళం సినిమా మీషా సినిమాలు రాబోతున్నాయి.
Also Read : నిర్మాతగా మారబోతున్న టాలీవుడ్ విలన్.. ఈ ట్విస్ట్ ఏంటి సార్..?
ఇవే కాదు మరి కొన్ని సినిమాలు కూడా సడన్గా ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే నిన్న రిలీజ్ అయిన మీరాయ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. ఇక ఈనెల 25న బోలెడు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా ఉండడంతో ఆయన అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు..