Jana nayagan: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతి బరిలో దిగాల్సిన ఈ సినిమా ఇప్పటికీ వాయిదా పడుతూనే వస్తోంది. పలుమార్లు పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా అసలు విడుదలవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడు? అసలు నిజంగానే ఆ తేదీకి ఈ సినిమా వస్తుందా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9 2026న మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ది రాజాసాబ్ కి పోటీగా ఈ సినిమా విడుదల చేయాల్సి ఉంది . కానీ చిత్రంలోని కొన్ని కీలక రాజకీయ, డైలాగులు సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు కోర్టులో ఉన్న కొన్ని పెండింగ్ ఇష్యూస్ వల్ల అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల కాలేదు.. అయితే ఈ విషయం విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం.. చిత్ర బృందం ఈ సమ్మర్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రభావం సినిమాపై పడకుండా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చిత్ర బృందం జాగ్రత్త పడుతోంది. అందులో భాగంగానే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే.. ఏప్రిల్ 24వ తేదీన ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురావాలని నిర్మాతలు యోచిస్తున్నట్లు సమాచారం..
ముఖ్యంగా ఈ తేదీన సినిమాను విడుదల చేయడం వల్ల ఎన్నికల వేడిలో ఉన్న ప్రజలు వేగంగా థియేటర్లకు వస్తారు అనే ఆలోచన చిత్ర బృందం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు విజయ్ సినిమా విడుదలైన వారం రోజుల వ్యవధిలోనే మరో స్టార్ హీరో ధనుష్ నటించిన కరా ఏప్రిల్ 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ఏప్రిల్ ఆఖరి వారంలో బాక్సాఫీస్ వద్ద ఇద్దరు అగ్ర హీరోల మధ్య పోటీ నెలకొనడం ఖాయమని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇకపోతే సెన్సార్ అడ్డంకులు దాటుకొని జననాయగన్ ఈసారైనా అనుకున్న తేదీకి వస్తుందో లేదో చూడాలి..
ALSO READ:డ్రగ్స్ విషయంలో సినిమా వాళ్లే టార్గెట్.. ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డ మంచు విష్ణు!
ఇక జననాయగన్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ దళపతి హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఇలా పలుమార్లు వాయిదా పడుతోంది.. మరొకవైపు విజయ్ దళపతి అటు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తన భార్య సంగీత విడాకుల కోరడం, అటు త్రిష తో ఎఫైర్ రూమర్స్ ఇలా నిత్యం వార్తల్లో నిలుస్తున్న విజయ్ దళపతి ఈసారి టీవీకే పార్టీ ద్వారా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. మరి ఆయనకు రాజకీయాలు ఏ విధంగా కలిసొస్తాయో చూడాలి.