E-Paper
Advertisement

రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి.. డెలివరీ బాయ్ వివాదమే కారణమా?

రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి..  డెలివరీ బాయ్ వివాదమే కారణమా?
Advertisement

Akhil Attack: డెలివరీ బాయ్ పైన రాజు వెడ్స్  రాంబాయి హీరో అఖిల్ రాజ్ దాడి వ్యవహారం ఇప్పుడు మరిన్నిమలుపులు తీసుకుంటున్నట్టె కనిపిస్తుంది. నిన్నటి వరకు మాటల యుద్ధానికి పరిమితమైన ఈ కాంట్రవర్సీ ఇప్పుడు ఏకంగా ఫిజికల్ అటాక్స్ వరకు వెళ్ళిపోయింది .అవును తాజాగా అఖిల్ రాజ్ ప్రయాణిస్తున్న కారుపై కొందరు గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా అటాచ్ చేయడం మీడియాలో తెగ హైలైట్ అవుతుంది.

అఖిల్ రాజ్ ప్రయాణిస్తున్న కారుపై దుండగుల అటాక్ 

Advertisement

అసలు విషయానికి వస్తే.. ఒక డెలివరీ బాయ్ ఆర్డర్ మార్చి పార్సెల్ ఇవ్వడమే కాకుండా తాగి తన తల్లిని తిట్టాడంటూ అఖిల్ రాజ్ ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే జరిగిన ఈ సంఘటనలో ఎవరిపై ఫిజికల్ అటాక్  చేయలేదని కేవలం తన తల్లిని తిట్టాడన్న కోపంతోనే వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టానని క్లారిటీ ఇచ్చాడు.ఒకవేళ తన సైడ్ ఏదైనా తప్పు ఉంటే బహిరంగంగా సారీ చెప్పడానికి కూడా సిద్ధమని ఇన్స్టాగ్రామ్  లో వీడియో వదిలాడు అఖిల్ రాజ్.అయితే ఈ వీడియో వదిలిన కొద్దిగంటల్లోనే అఖిల్  రాజ్ ప్రయాణిస్తున్న కారుపై కొందరు దుండగులు అటాక్ చేయడం ఇక్కడ అనుమానాలను రేకెత్తిస్తుంది.

ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం  పెద్ద దెబ్బ

మరి ఆ డెలివరీ బాయ్ వెనకాల ఉన్న వారే అటాక్ చేశారా లేక ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకొని మరి ఎవరైనా అటాక్ ప్లాన్ చేశారా అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్.ఇక అఖిల్ రాజ్ విషయానికి వస్తే  గతంలో చిన్న చిన్న సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాని ఈ కుర్ర హీరోకి రాజు వెడ్స్ రాంబాయ్  ఓవర్ నైట్ స్టార్ డమ్  తీసుకువచ్చింది.ఇలా హీరోగా నిలదొక్కుకుంటున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం తన కెరీర్ కి పెద్ద దెబ్బ అని చెప్పాలి .

అఖిల్ రాజ్ ఇన్సిడెంటే  ఒక పెద్ద ఎగ్జాంపుల్

Advertisement

అయితే ఇదే గొడవపై రెండు వర్గాలుగా విడిపోయారు నెటిజన్లు .డెలివరీ బాయ్ తో గొడవ అయింది నిజమే కానీ ఇలా హీరో కార్ పై  నడిరోడ్డు మీద అటాచ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కొందరు ప్రశ్నిస్తుంటే, అసలు హీరో కార్ పై  అటాక్  చేసింది వాళ్లే అని ఎలా చెబుతారు అంటూ మరి కొంతమంది వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ రోజుల్లో జరుగుతున్న చిన్న చిన్న ఘటనలు ఎంత వేగంగా సీరియస్ టర్న్  తీసుకుంటాయో  అఖిల్ రాజ్ ఇన్సిడెంటే  ఒక పెద్ద ఎగ్జాంపుల్. చూడాలి మరి అఖిల్ రాజ్ కార్ పై  అటాక్ చేసిన వారు ఎవరు అనేది ఎప్పుడు తేలుతుందో !

ALSO READ:వెంకీ మామ, కళ్యాణ్ రామ్‌లతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. జనవరి 13 రిలీజ్ వెనుక అసలు ట్విస్ట్!

Related News

సమంత కొత్త అవతారం.. ఈసారి వంటగదిలోకి స్టార్ హీరోయిన్!

సంక్రాంతికి స్టార్ హీరోల జాతర.. థియేటర్లు సరిపోతాయా గురూ?

‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’…. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ థ్రిల్లర్!

రక్తంతో తడిసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి అదిరిపోయే పోస్టర్.. ఫ్యాన్స్‌కు పండగే!

ఆగస్టు 15 వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. నిహారిక, లావణ్య స్పెషల్ అట్రాక్షన్

ఎర్ర కండువా.. చేతిలో తుపాకీ.. శ్రీ విష్ణు మాస్ లుక్ అదిరిపోయిందే!

ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. ‘సెయాన్’ అప్డేట్ వచ్చేసింది..

Big Stories

Advertisement
×