Toxic:రాకింగ్ స్టార్ యష్ హీరోగా, ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా చిత్రం టాక్సిక్. ఇటు పాన్ ఇండియా భాషలతో పాటు అటు ఇంగ్లీషులో కూడా ఈ సినిమా ఒకేసారి విడుదల కాబోతోంది. ఇప్పటికీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో మేకర్స్ మరో కీలక అప్డేట్ తో అంచనాలను తారాస్థాయికి పెంచేశారు. గతంలో ప్రకటించినట్లుగానే ఈ సినిమాకు సంబంధించిన మహిళా పాత్రలపై ప్రత్యేకంగా రూపొందించిన ఈ టీజర్ ను తాజాగా విడుదల చేసి సినిమాపై ఊహించని ఇమేజ్ పెంచేసారని చెప్పవచ్చు.
‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎపిక్ మూవీ నుండి లేడీస్ అండ్ లేడీస్ పేరుతో ఒక చిన్న స్పెషల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇందులో డార్క్, స్టైలిష్ , డేంజరస్ ప్రపంచాన్ని శాసించబోయే శక్తివంతమైన మహిళా శక్తులను మేకర్స్ పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ బోల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. పవర్, మిస్టరీ, యాటిట్యూడ్ అండ్ రష్ తో నిండిన ఈ వీడియోలో లేడీస్ పాత్రలు ఎంత ఊర మాస్ గా ఉండనున్నాయో అర్థం అవుతుంది.
ALSO READ:సమంత క్యూట్ బేబీ బంప్ లుక్ వైరల్..పోస్ట్ వైరల్!
ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ క్రేజీ వీడియోలో.. కియారా అద్వానీ , నయనతార, రుక్మిణి వసంత్ , తార సుతారియ, హుమా ఖురేషి వంటి టాప్ హీరోయిన్లు తమ అల్ట్రా స్టైలిష్ స్క్రీన్ ప్రెజెంట్స్ తో మైండ్ బ్లాక్ చేశారు. పైగా నయనతార అత్యంత పవర్ఫుల్ లుక్ లో కనిపించి ఆకట్టుకోగా.. కియారా అద్వానీ మరొకసారి తన మాగ్నెటిక్ ఎనర్జీతో మెప్పించింది. రుక్మిణి వసంత్ ఇంటెన్సిటీ లుక్, తారా సుతారియా చలాకీగా, హుమా ఖురేషి ఇలా ఎవరికి వారు తమ పాత్రలతో అదరగొట్టేశారు. ఒక మహిళ వాయిస్ ఓవర్ ద్వారా వచ్చే పవర్ఫుల్ డైలాగ్ ఈ వీడియోని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. పైగా ఇందులో” లేడీస్ అండ్ లేడీస్.. ఒక్కొక్కరిగా వస్తారా ? లేక ఒకేసారి వస్తారా?” అని చెప్పే డైలాగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఇకపోతే ఈ వీడియో స్టార్ట్ అవ్వగానే..” పిల్లలు దూరంగా ఉండండి.. తల్లిదండ్రులు.. మీ పిల్లలను దూరంగా ఉంచండి .. నానమ్మ , తాతమ్మలు మీ పిల్లల పిల్లలను దూరంగా ఉండేలా చూసుకోండి. ఇక ముత్తాతలు మీ సొంత రిస్క్ పైన చూడండి” అంటూ ఇచ్చిన క్యాప్షన్ సినిమాను ఏ రేంజ్ రా కంటెంట్ తో రూపొందించారో అర్థమవుతుంది. ఇక కె.వి.ఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26వ తేదీన కన్నడ, ఇంగ్లీష్ , తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొత్తానికైతే భారీ అంచనాలు పెంచేస్తున్న ఈ వీడియో సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా రికార్డ్స్ కొల్లగొట్టడం ఖాయం అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.