E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Kayadu lohar: 10వ తరగతిలోనే తల పగలగొట్టిన కాయాదు లోహర్.. ఏం జరిగిందంటే?

Kayadu lohar: 10వ తరగతిలోనే తల పగలగొట్టిన కాయాదు లోహర్.. ఏం జరిగిందంటే?
Advertisement

Kayadu lohar: ఆవగింజంత అదృష్టం ఉంటే ఎలాంటి వారైనా సరే ఊహించని పాపులారిటీ అందుకుంటారనడంలో సందేహం లేదు. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతోమంది సెలబ్రిటీలు ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత.. ఆ అదృష్టం కలిసి వచ్చి మళ్లీ తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో కాయాదు లోహార్ (Kayadu lohar) కూడా ఒకరు. తొలిసారి ‘ముఖిల్ పేట్టై’ అనే చిత్రంతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. వాస్తవానికి అస్సామీ బ్యూటీ అయినప్పటికీ ఇక్కడ సౌత్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలా తొలిసారి అల్లూరి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే ఈ సినిమా ఈమెకు విజయాన్ని అందించలేదు.

పదహారేళ్ళ వయసులో చేదు అనుభవం..

ఇక తర్వాత రూటు మార్చుకున్న ఈమె తమిళ్లో డ్రాగన్ సినిమా చేసింది. ఈ సినిమా ఈమె స్టార్ డంను ఒక్కసారిగా మార్చేసింది. ఈ ఒక్క సినిమాతో సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అలా తెలుగు, తమిళ్ ,మలయాళం లో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయిన ఈమె.. ఈ ఏడాది ఇప్పటికే తెలుగులో ఫంకీ సినిమా చేసి అలరించింది. అలాగే ‘పళ్ళి చట్టంబి’ చిత్రంతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాయాదు తనకు పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడు జరిగిన చేదు అనుభవాన్ని అభిమానులతో గుర్తుచేసుకుంది. పదవ తరగతిలో ఉన్నప్పుడే ఒకరి తల పగలగొట్టాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

కుర్రాడి తల పగలగొట్టిన కాయాదు..

Advertisement

ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా కాయాదు లోహర్ మాట్లాడుతూ.. “నేను పదవ తరగతి చదువుకునే రోజుల్లో మా ఇంటికి దగ్గరలోనే ట్యూషన్ ఉండేది. దానికి నేను ప్రతిరోజు వెళ్లే దాన్ని. అయితే ఒక రోజు ఒక కుర్రాడు నన్ను ఫాలో అవుతూ ఇబ్బంది పెట్టాడు. నేను పట్టించుకోలేదు. మళ్ళీ మళ్ళీ నా వెంట పడుతూ హద్దులు మీరడంతో కోపం వచ్చేసింది. ఇక అంతే పక్కనే ఉన్న ఒక్క పెద్ద రాయి తీసుకొని అతడి తల మీద కొట్టాను. రక్తం కారడంతో అక్కడి నుంచి పారిపోయాను” అంటూ కారాదు గుర్తుచేసుకుంది. దీనిపై ఆమె మాట్లాడుతూ..” నేను చూడడానికి బయటకు చాలా సాఫ్ట్ గా కనిపించినా.. ఎవరైనా తప్పు చేస్తే నాలో కోపం కట్టలు తెంచుకుంటుంది” అంటూ తెలిపింది.చూడడానికి సాప్ట్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మలో ఇంత కోపం ఉందా అంటూ ఈమె మాటలు విన్న అభిమానులు, నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:ఇబ్బందుల్లో పడ్డ అమెజాన్ ప్రైమ్ వీడియో.. నష్టం తప్పదా?

కాయాదు ప్రస్తుత సినిమాలు..

Advertisement

కాయాదు ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె నాని ది పారడైజ్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు చివర ఆఖరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే..మరి ఈ సినిమాతో కాయాదు తెలుగులో గట్టి కం బ్యాక్ ఇవ్వడం ఖాయమనే కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి.

Related News

నాడు ఉపాసన.. నేడు సురేఖ.. మెగా కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవులు!

5 మంది హీరోయిన్స్ తో టాక్సిక్ నుండి అదిరిపోయే వీడియో రిలీజ్.. యశ్ లుక్స్ చూసారా?

సమంత క్యూట్ బేబీ బంప్ లుక్ వైరల్..పోస్ట్ వైరల్!

Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్.. చిరు టు సమంత హిట్ సినిమాలు..

సత్యదేవ్ ఖాతాలో మరో మాస్టర్ పీస్? ఉత్కంఠ రేపుతోన్న ‘రావు బహదూర్’ ట్రైలర్..

రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి.. డెలివరీ బాయ్ వివాదమే కారణమా?

వెంకీ మామ, కళ్యాణ్ రామ్‌లతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. జనవరి 13 రిలీజ్ వెనుక అసలు ట్విస్ట్!

Big Stories

×