E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

వెంకీ మామ, కళ్యాణ్ రామ్‌లతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. జనవరి 13 రిలీజ్ వెనుక అసలు ట్విస్ట్!

వెంకీ మామ, కళ్యాణ్ రామ్‌లతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. జనవరి 13 రిలీజ్ వెనుక అసలు ట్విస్ట్!
Advertisement

Sankranti Release:’సంక్రాంతి పండగ నా అడ్డా’ అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇదే క్రమంలో తాజాగా మొదలెట్టిన విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో మొదలెట్టిన సినిమా కూడా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ వినిపిస్తుంది .

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో 13 అంటే డెవిల్ నెంబర్ గా భావిస్తారు కానీ అనిల్ రావిపూడి వ్యవహారం మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తుంది. పండగ సీజన్ ని క్యాష్ చేసుకోవడంలో ఆరితేరిన ఈ కుర్ర డైరెక్టర్ 13వ తేదీ తర్వాత వచ్చే హాలిడేస్ ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు తప్ప ఇలాంటి నెంబర్ భయాలని  అస్సలు పట్టించుకోనట్టే కనిపిస్తుంది .

ఈ ప్లాన్ వెనుకున్న అస్సల్ సీక్రెట్

Advertisement

జనవరి 13 అంటే సంక్రాంతికి ముందు వచ్చే భోగి. ఇక ఆ తర్వాత వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి ఎలాగు ఉండనే ఉంది ,తర్వాత  కనుమ.సో వరుస  పబ్లిక్ హాలిడేస్ లలో సాలిడ్  కలెక్షన్స్ ని కొల్లగొట్టడానికి ఇది ఒక మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ అనే చెప్పాలి. గతంలో అనిల్ రావిపూడి ఇచ్చిన బ్లాక్ బాస్టర్స్ ని పరిశీలిస్తే ఈ ప్లాన్ వెనుకున్న అస్సల్ సీక్రెట్ క్లియర్ గా అర్థమవుతుంది కూడా .

వెంకటేష్ తో చేసిన ఎఫ్2 సినిమా 12న రిలీజ్ అయి సూపర్ హిట్ కాగా మహేష్ బాబుతో తీసిన సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 12న రిలీజ్ అయి సాలిడ్ కలెక్షన్స్ ని కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇక 2025లో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా, 2026 లో సాహూ గార పాటి నిర్మాణంలో జనవరి 14న వచ్చిన మన శంకర్ ప్రసాద్ గారు సినిమా ఎలాంటి సాలిడ్ కలెక్షన్స్ రాబట్టాయో  చెప్పక్కర్లేదు అలా వరుసగా పండుగ సీజన్లోనే హిట్టు కొడుతూ హిట్ మిషిన్ గా మారిన ఈ కుర్ర డైరెక్టర్ తన పదవ సినిమాకి కూడా అదే రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తుంది.

సినిమాకి సంక్రాంతి మొగుళ్ళు అనే టైటిల్

Advertisement

ఇక వెంకీ కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి సంక్రాంతి మొగుళ్ళు అనే టైటిల్ పెట్టనున్నారని ఫిలిం సర్కిల్లో గట్టిగా వినిపిస్తుంది. ఇక ఈ సినిమాకి మరో ఎసెట్ ఏంటంటే డిఫరెంట్ ఇమేజ్ ఉన్న స్టాఫ్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవడం. తనకు డైరెక్టర్ గా  లైఫ్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ .అలాగే తన కెరీర్ లో 100 కోట్ల సినిమాని ఇచ్చిన విక్టరీ వెంకటేష్ ని ఒకే ఫ్రేమ్ లో చూపించబోతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

ALSO READ:‘నేనూ ఒకప్పుడు డెలివరీ బాయ్‌గా చేశా’.. వైరల్ వీడియో పై అఖిల్ రాజ్ క్లారిటీ!

ఇక ఈ సినిమాకి కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ జీవి ప్రకాష్ సంగీతమందిస్తుండడం విశేషం .మొత్తానికి సెంటిమెంట్ల ప్రకారం 13వ తేదీని డెవిల్ నెంబర్ అనుకున్న బాక్సాఫీస్ వద్ద హాలిడేస్ లలో వచ్చే ఓపెనింగ్స్ ముందు ఏ సెంటిమెంట్లు పనిచేయవని కంటెంట్ బాగుంటే ఆ డెవిల్ నెంబర్ లక్కీ నెంబర్ గా మారుతుందని అని రావిపూడి గట్టిగా ఫిక్స్ అయ్యాడన్నమాట చూడాలి మరి పొంగల్ బరిలో దిగుతూ వరుస సక్సెస్ లు చూస్తున్న అనిల్ రావిపూడి కి జనవరి 13 ఇలాంటి జ్ఞాపకాలను మిగులుస్తుందో!

Related News

సత్యదేవ్ ఖాతాలో మరో మాస్టర్ పీస్? ఉత్కంఠ రేపుతోన్న ‘రావు బహదూర్’ ట్రైలర్..

రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి.. డెలివరీ బాయ్ వివాదమే కారణమా?

‘నేనూ ఒకప్పుడు డెలివరీ బాయ్‌గా చేశా’.. వైరల్ వీడియో పై అఖిల్ రాజ్ క్లారిటీ!

లెనిన్’తో అయ్యగారు ఈసారైనా హిట్ కొడతారా?

రంభ ఊర్వశి మేనక అంటున్న అల్లరోడు… ఈసారైనా అలరిస్తాడా ?

వంద కోట్లొచ్చాయని డబ్బా కొట్టుకున్నారు.. కానీ డైరెక్టర్‌కు’ పెద్ద నామం పెట్టారు!

ఎన్టీఆర్ కొత్త సినిమా పోస్టర్‌పై చెలరేగుతున్న వివాదం… ఇంతకీ మురుగన్ పుట్టింది ఎక్కడ ?

Big Stories

×