E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

సమంత క్యూట్ బేబీ బంప్ లుక్ వైరల్..పోస్ట్ వైరల్!

సమంత క్యూట్ బేబీ బంప్ లుక్ వైరల్..పోస్ట్ వైరల్!
Advertisement

Samantha:15 ఏళ్ల తర్వాత సమంత జీవితంలో తొలిసారి సంతృప్తి మొదలైంది అంటూ ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి చేసిన కామెంట్లు అభిమానులను సంతోష పరుస్తున్నాయి. ఇక ఆ సంతృప్తికి తగ్గట్టుగానే ఒకవైపు సినిమా సక్సెస్ లతో దూసుకుపోతూ.. మరొకవైపు తన వైవాహిక జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత తెలుగులో మా ఇంటి బంగారం సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో తన యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. సినిమాను భుజాలపై వేసుకొని మోసిన సమంతకు మంచి గుర్తింపు లభించింది. పైగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.

బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన సమంత..

అయితే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా బేబీ బంప్ తో కనిపించి మరో శుభవార్తను ఇన్ డైరెక్ట్ గా ప్రకటించిన సమంత.. ఆ తర్వాత ఈ సినిమా సక్సెస్ మీట్ లో తాను ప్రెగ్నెంట్ అని మీడియా మిత్రులతో పంచుకుంది. అలా మొత్తానికి అయితే తాను తల్లి కాబోతున్నానని, అందుకే కొద్ది రోజులు మెటర్నిటీ లీవ్ తీసుకుని మళ్లీ ఇండస్ట్రీలోకి వస్తానని తెలిపింది. ఇక ఇప్పుడు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న నేపథ్యంలో అటు మెగాస్టార్ చిరంజీవి కూడా సమంత , రాజ్ దంపతులను ఆశీర్వదించారు. మొత్తానికి అయితే ప్రెగ్నెన్సీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న సమంత.. తాజాగా తన బేబీ బంప్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. వీటికి ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా జోడించింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

ALSO READ:Kayadu lohar: 10వ తరగతిలోనే తల పగలగొట్టిన కాయాదు లోహర్.. ఏం జరిగిందంటే?

క్యూట్ అండ్ ఫన్నీ క్యాప్షన్..

సమంత తన అధికారిక ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ లో తన గర్భాన్ని చూపిస్తూ దిగిన ఒక క్యూట్ ఫోటోని పోస్ట్ చేస్తూ.. ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా జోడించింది. వాస్తవానికి ఫిట్నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఈమె తాజాగా జిమ్ నుండి తన బేబీ బంప్ ఫోటోని షేర్ చేస్తూ..” నా సిక్స్ ప్యాక్.. నేను నిన్ను చూడాల్సిన సమయంలో చూస్తాను” అంటూ తన ప్రెగ్నెన్సీ ని ఉద్దేశించి రాసుకుంది. ఇక సమంత పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సినీ సెలెబ్రెటీలు, అభిమానులు ఈమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

సమంత వైవాహిక జీవితం..

సమంత వైవాహిక జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లైన నాలుగేళ్లకే విడిపోయిన సమంత.. ఆ తర్వాత కొంతకాలం మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇబ్బందులు పడింది. ఇండస్ట్రీకి ఏడాది పాటు విరామం కూడా ప్రకటించింది. ఇక బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడ్డ ఈమె.. 2025 డిసెంబర్ 1న కోయంబత్తూర్ లోని సద్గురు ఈషా ఫౌండేషన్ లో అత్యంత ఆత్మీయుల సమక్షంలో సింపుల్ గా వివాహం చేసుకుంది. ఇకపోతే వివాహానికంటే ముందే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు రాగా, దీనికి కారణం గతంలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్, హనీ బన్నీ వంటి ప్రాజెక్టులకు కలిసి పని చేశారు. అలాగే వరల్డ్ పికిల్ బాల్ లీగ్ సమయంలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మద్దతుగా నిలిచారు. ఇక ఆ సమయంలోనే వీరిద్దరి ప్రేమాయణంపై పుకార్లు వచ్చాయి. ఇక ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది తాను గర్భవతిని అన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

Related News

నాడు ఉపాసన.. నేడు సురేఖ.. మెగా కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవులు!

5 మంది హీరోయిన్స్ తో టాక్సిక్ నుండి అదిరిపోయే వీడియో రిలీజ్.. యశ్ లుక్స్ చూసారా?

Kayadu lohar: 10వ తరగతిలోనే తల పగలగొట్టిన కాయాదు లోహర్.. ఏం జరిగిందంటే?

Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్.. చిరు టు సమంత హిట్ సినిమాలు..

సత్యదేవ్ ఖాతాలో మరో మాస్టర్ పీస్? ఉత్కంఠ రేపుతోన్న ‘రావు బహదూర్’ ట్రైలర్..

రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి.. డెలివరీ బాయ్ వివాదమే కారణమా?

వెంకీ మామ, కళ్యాణ్ రామ్‌లతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. జనవరి 13 రిలీజ్ వెనుక అసలు ట్విస్ట్!

Big Stories

×