Vikramarkudu Child Artist Lawrence Photo: ‘ఏయ్.. సత్తి ఇటువైపు బాలోచ్చిందా‘ ఈ డైలాగ్తో సినిమాలోనే హైలెట్ అయ్యాడు ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టు రవి రాథోడ్ (Vikramarkudu Child Artist Ravi). చైల్డ్ ఆర్టిస్టుగా సుమారు 25కు పైగా సినిమాల్లో నటించాడు. కానీ, అతడు మాత్రం విక్రమార్కుడ చైల్డ్ ఆర్టిస్టుగా ఫుల్ ఫేమస్ అయ్యాడు. అయితే ఆ తర్వాత అతడు తెరపై కనుమరగయ్యాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాడు. ఇతడిని చూసి అంత అవాక్క్ అయ్యారు.
సినిమాల్లో చురుగ్గా కనిపించిన అతడు బక్కచిక్కి పేలవంగా మారి, అనారోగ్య పరిస్థితుల్లో కనిపించాడు. సినిమాలో రవి రాథోడేనా అని అంత షాక్ అయ్యారు. బాగా చదివి జీవితంలో సెటైలైపోతాడు అనుకుంటే.. మద్యానికి బానిసై ఎలాంటి ఆధారం లేక అనాథగా నడిరోడ్డుపై పడ్డాడు. పైగా తీవ్రమైన ఆరోగ్యం. తాగి తాగి అతడి కిడ్నిని పని చేయని స్థితికి చేరాయి. దీంతో సరిగ్గా నడవలేని స్థితికి చేరుకున్నాడు రవి. ఇతడిని చూసిన కొందరు విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్టు అంటూ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి కాస్తా రాఘవ లారెన్స్ కంటపడ్డాయి.
దీంతో అతడిని ఒక్కసారి తనని కలవాలంటూ సోషల్ మీడియాలోనే రిక్వెస్ట్ చేశాడు లారెన్స్. లారెన్స్ ట్వీట్ చూసి రవి చెన్నై వెళ్లి ఆయనను కలిశాడు. అతడి పరిస్థితి చూసి చలించిన లారెన్స్ మొదట రవిపై చాలా సీరియస్ అయ్యాడట. జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నావంటూ చీవాట్లు పెట్టాడట. ఇకపై తాగొద్దని రవి దగ్గర మాట కూడా తీసుకున్నాడు లారెన్స్. అంతేకాదు రవి డబ్బు సాయం చేశాడు. ఆ డబ్బుతో మంచి ఫోన్ కొనుక్కుని, కిడ్నీ సమస్యకు చికిత్స తీసుకుంటున్నాడు. అలాగే లారెన్స్కి ఇచ్చిన మాట కోసం రవి తాగుడు మానేసి ఆరోగ్యంపై దృష్టి పెట్టాడు.
అంతేకాదు అతడి వైద్యానికి అయ్యే ఖర్చుని కూడా లారెన్సే చూసుకుంటున్నాడట. ఈ క్రమంలో తాజాగా రవి రాథోడ్ లారెన్స్‌తో దిగిన ఫోటోని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీంతో మరోసారి రవి రాథోడ్ గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కాగా రవి రాథోడ్ అనాథ అని తెలిసి లారెన్స్ అతడికి బాధ్యతను తీసుకుకోవాలని అనుకున్నారు. అన్నట్టుగానే రవిని చెన్నై తీసుకువెళ్లి ఓ మంచి స్కూల్లో చేర్పించాడు. కానీ, చదువు ఇష్టం లేక రవి లారెన్స్ చెప్పకుండ హైదరబాద్ వచ్చేసినట్టు గతంలో అతడే చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: Archana Kavi: సీక్రెట్గా ప్రియుడిని రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు వైరల్