BigTV English

Saamrajyam Promo:‘సామ్రాజ్యం’ ప్రోమో.. నా పాత్రకు ఎన్టీఆర్ కరెక్ట్ అంటూ ఇరగదీసిన శింబు, మైండ్ బ్లోయింగ్ సీన్ రిలీజ్

Saamrajyam Promo:‘సామ్రాజ్యం’ ప్రోమో.. నా పాత్రకు ఎన్టీఆర్ కరెక్ట్ అంటూ ఇరగదీసిన శింబు, మైండ్ బ్లోయింగ్ సీన్ రిలీజ్
Advertisement

Saamrajyam Promo:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శింబు (Simbu) హీరో తమిళ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaran) దర్శకత్వంలో తాజాగా నటిస్తున్న చిత్రం ‘సామ్రాజ్యం’. తమిళంలో ‘అరసన్’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెట్రిమారన్ ‘ వడ చెన్నై’ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఇంట్రడక్షన్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. సుమారుగా 5 నిమిషాల పాటు ఉన్న ఈ ప్రోమో శింబు పాత్రను పరిచయం చేసినట్లుగా అనిపిస్తోంది. ముగ్గురిని హత్య చేసిన ఒక కేసులో అరెస్ట్ అయిన శింబు.. తాను ఎందుకు అరెస్ట్ అయ్యాడు అనే విషయాన్ని మీడియాకు వివరిస్తున్న సన్నివేశంతో ఈ ప్రోమో సాగుతుంది.


సామ్రాజ్యం ఇంట్లో ప్రోమో రిలీజ్..

ప్రోమో విషయానికి వస్తే.. కట్ చేస్తే కోర్ట్ ముందర శింబు.. మీడియాతో మాట్లాడుతూ… నేను చెప్పబోయే విషయం మొత్తం రియాలిటీనే.. నరికినోళ్లు , సచ్చినోళ్ళు సమయం, పేరు మొత్తం రియాలిటీనే. మామూలుగా సినిమా ముందు ఒక కారు వేస్తారు కదా.. ఈ సినిమాలో జరిగేదంతా బూటకం అని అట్లాంటి ఒక కార్డు మీరు కూడా వేయండి. నేను చెప్పబోయే ఈ మేటర్ సగానికి పైగా కేసు ఇంకా కోర్టులోనే ఉంది. నా పాటికి నేను సిల్లీగా మేటర్ చెప్పేసి.. మీ పాటికి మీరు సినిమా తీసేస్తే సీన్ సితారే. ఈ మేటర్ కనుక బయటకొచ్చింది అంటే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, మనలాంటి ఇన్నోసెంట్లు, రాజకీయ నాయకులు, లాయర్లు, కొంతమంది జడ్జిలు కూడా జైలు కెల్లాల్సి ఉంటుంది. అందుకే ఆ కార్డు వేయమని చెప్తున్నాను.. వేస్తే నేను ఫ్రీ.. మీరు సంతోషంగా సినిమా తీసేయొచ్చు.

నా పాత్రకు ఎన్టీఆర్ కరెక్ట్..

తర్వాత మన కేసే.. నేను పోయి వచ్చి డీటెయిల్ గా చెప్తాను.. అంటూ శింబు కోర్టు లోపలికి వెళ్తూ ఉండగా.. మళ్లీ వెనుతిరిగి మీడియాతో మన విషయంలో ఎవరు సార్ నటించబోతున్నారు అని ప్రశ్నించగా.. నీ మైండ్లో ఎవరున్నారో చెప్పు అని మీడియా మిత్రులు అడిగితే.. ఎన్టీఆర్ (Jr NTR) చేత చేయించండి సర్.. పెర్ఫార్మన్స్ కుమ్మిపడేస్తాడు అంటూ చెప్పిన డైలాగు.. ప్రోమోకే హైలెట్గా నిలిచింది. లోపలికి వెళ్ళిన శింబుని జడ్జి ప్రశ్నిస్తూ.. ఆ ముగ్గురిని నువ్వే చంపావా అని అడగ్గా.. లేదని చెబుతాడు. ఆ తర్వాత శింబు అసలు పాత్ర రిలీజ్ చేశారు.


తెలుగులో ఎన్టీఆర్ చేతుల మీదుగా..

చాలా పవర్ ఫుల్ గా ఉన్న ఈ ప్రోమో సినిమా పై అంచనాలను పెంచేసింది. పైగా ఈ సామ్రాజ్యం ప్రోమోను తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ విడుదల చేశారు. అటు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ గా మారుతోంది. మొత్తానికైతే శింబు ఇందులో ఇరగదీయడమే కాకుండా ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ ఇంట్రో ప్రోమోని తెగ షేర్ చేస్తున్నారు.

ALSO READ:Priyanka Jain: పెళ్లి కాకుండానే డ్రీమ్ హోమ్.. ఏకంగా కోటి ఖర్చు అంటూ!

Related News

Lawrence: ‘విక్రమార్కుడు’ చైల్డ్‌ ఆర్టిస్టుపై లారెన్స్‌ సీరియస్.. అసలేం జరిగిందంటే!

Archana Kavi: సీక్రెట్‌గా ప్రియుడిని రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్‌.. ఫోటోలు వైరల్‌

Hero Vishal : కోర్టుకెక్కిన లైకా..హీరో విశాల్ కు షాక్.. ఏం జరిగిందంటే..?

Siddhu Jonnalagadda: ఒక్క మాట.. సిద్ధుపై సోషల్ మీడియాలో పెరుగుతున్న నెగిటివ్!

Samyuktha Menon: విమెన్ సెంట్రిక్ మూవీతో సంయుక్త.. సక్సెస్ అవుతుందా?

Actress Death: ప్రముఖ నటి కన్నుమూత.. అసలేం జరిగిందంటే?

Sonakshi Sinha: ‘ హ్యుమన్ హిస్టరీ రికార్డ్ ‘.. ప్రగ్నెన్సీ పై ఒక్కమాటతో నోరు మూయించిందిగా..

Big Stories

×