BigTV English

Diwali 2025: దీపావళి రోజు ఇంటికి ఇవి కొని తెస్తే .. అష్టైశ్వర్యాలు కలుగుతాయ్

Diwali 2025: దీపావళి రోజు ఇంటికి ఇవి కొని తెస్తే .. అష్టైశ్వర్యాలు కలుగుతాయ్
Advertisement

Diwali 2025: దీపావళి పండగకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండగను దేశ వ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దీపావళి ఇళ్లలో సానుకూల శక్తి , శ్రేయస్సును అందిస్తుంది. ఇదిలా ఉంటే దీపావళి సమయంలో కొన్ని రకాల ఫొటోలను ఇంట్లో అలంకరించడం వల్ల ఇంటి అందం పెరుగడమే కాకుండా లక్ష్మీ దేవి ఆశీర్వాదం, శాంతి, ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తాయని నమ్ముతారు. దీపావళి రోజున కొంత మంది లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తారు.


ఇదిలా ఉంటే.. దీపావళికి మీ ఇంటికి శుభం, శక్తిని తీసుకురావాలనుకుంటే.. ఈ ఐదు రకాల ఫొటోలను ఉంచడం మర్చిపోకూడదు. పండగ సమయంలో మీ ఇంటిని దీపాలతోనే కాకుండా సానుకూలతను అందించే ఫొటోలతో కూడా అలంకరించండి. మీరు మీకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ పవిత్రమైన ఫొటోలను బహుమతిగా ఇవ్వడం మంచిది.

1. లక్ష్మీ, వినాయకుడు కలిసి ఉన్న ఫొటో:
దీపావళి రోజున లక్ష్మీదేవి, వినాయకుడు కలిసి పూజించడం చాలా ముఖ్యం. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను ఇంటికి తీసుకురండి. వీటిలో లక్ష్మీదేవి, వినాయకుడి ముఖాలు స్పష్టంగా కనిపించేలా చూసుకోండి. వాటితో పాటు గణేశుడి వాహనం ఎలుక ఉండాలి. చిత్రానికి కుడి వైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున వినాయకుడి విగ్రహం ఉండాలి. మీ ఇంటి తూర్పు గోడపై ఈ ఫొటోను ఉంచండి. ఇది సంపద, జ్ఞానం, అదృష్టాన్ని తీసుకువస్తుంది.


2. కమలాసన భంగిమలో లక్ష్మీదేవి:
కమలం మీద కూర్చున్న లక్ష్మీదేవి ప్రతిమను ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. పూజా గదిలో లేదా హాల్‌లో అలాంటి ఫొటోను ఉంచడం వల్ల పేదరికాన్ని దూరం చేసి శాశ్వత సంపదను పొందవచ్చు. అంతే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. అప్పుల బాధ నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

3. కుబేరుడి ఫొటో:
కుబేరుడిని సంపదకు అధిపతిగా భావిస్తారు. దీపావళి రోజున లక్ష్మీ, కుబేరుడు కలిసి ఉన్న ఫొటోను ఉంచడం వల్ల సంపదకు కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ ఫొటో దగ్గర ఐదైనా లోహంతో తయారు చేసిన నాణెం లేదా రత్నాన్ని ఉంచండి. అది శ్రేయస్సును అందించడంలో అయస్కాంతంగా మారుతుంది.

Also Read: దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి ? ఏ నూనెతో వెలిగిస్తే మంచిది ?

4. వెలుగుతున్న దీపాల ఫొటో:
దీపాలు శుభాన్ని, వెలుగును సూచిస్తాయి. గదిలో లేదా ప్రవేశ గోడపై వీటికి సంబంధించిన ఫొటో ఉంచితే.. అవి ఇంట్లో “శాశ్వత కాంతి”ని నిలపడానికి సహాయపడతాయి. దీపాలు ఆనందం, అదృష్టం యొక్క శాశ్వత ఉనికిని సూచిస్తాయి.

5. ఆవు, దూడ:
ఆవులను ఎల్లప్పుడూ పవిత్రమైనవిగా, శుభప్రదమైనవిగా భావిస్తారు. ఆవు, దాని దూడతో ఉన్న ఫొటోలను ఇంట్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఉదయం ఆవు, దూడను కలిసి ఉన్న ఫొటో చూడటం చాలా శుభప్రదం. కాబట్టి..తప్పనిసరిగా ఇలాంటి ఫొటోను ఇంట్లో ఉంచుకోండి. దీని వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా శ్రేయస్సు, అనంతరం ఇంట్లో పెరుగుతాయి.

Also Read: దీపావళి పండగను ఏ రోజు జరుపుకోవాలి ? అక్టోబర్ 20 లేదా 21 నా?

Related News

Wakeup at Night: రాత్రి ఆ సమయంలో నిద్రలేస్తున్నారా.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీకు తెలుసా?

Diwali 2025: దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి ? ఏ నూనెతో వెలిగిస్తే మంచిది ?

Diwali: భార్య చేసే ఈ ఒక్క ట్రిక్ తో భర్త సుడి తిరగడం ఖాయం.. ఏంటీ ఆ రహస్యం

Diwali 2025: దీపావళి పండగను ఏ రోజు జరుపుకోవాలి ? అక్టోబర్ 20 లేదా 21 నా?

Lord Hanuman: పూరిలో బేడి హనుమాన్‌.. భగవంతునికి ఎందుకు బేడీలు వేశారు?

Eye Twitching: ఏ కన్ను అదిరితే మంచిది ? పురాణాల్లో ఏముంది ?

Vastu Tips: కర్పూరంతో ఈ పరిహారాలు చేస్తే.. ఎలాంటి వాస్తు దోషాలైనా మటుమాయం !

Big Stories

×