Archana Kavi Wedding: ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ హీరోయిన్, ప్రముఖ నటి అర్చన కవి (Actress Archana Kavi Marriage) పెళ్లి పీటలు ఎక్కింది. తన ప్రియుడు రిక్ వర్గీస్‌తో ఏడడుగులు వేసింది. ఇది అర్చనకు రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు, ఇండస్ట్రీవర్గాల మధ్య ఆమె పెళ్లి జరిగింది. అర్చన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ప్రముఖ టీవీ హోస్ట్ ధన్య వర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ విషెస్ తెలిపింది. దీంతో అర్చన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా అర్చన కవికి ఇది రెండో పెళ్లి.
గతంలో ఆమె ప్రముఖ హాస్య నటుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్ అబీష్ మాథ్యూని పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్లైన వీరిద్దరికి ఓ ఈవెంట్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2016లో అబీష్ మాథ్యూతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కొంతకాలం అన్యోన్యంగా జీవించిన వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2021లో విడాకులు తీసుకుని వైవాహిక జీవితానికి స్వస్తీ పలికింది అర్చన.
ఆ తర్వాత సింగిల్ జీవిస్తున్న అర్చనకు రిక్ వర్గీస్ ఓ డేటింగ్ యాప్‌లో పరిచయం అయ్యాడు.అతడితో కొంతకాలం చాటింగ్, పరిచయం తర్వాత ఈ ఏడాది (2025) అక్టోబర్లో మరోసారి పెళ్లీ పీటలు ఎక్కింది. కాగా రిక్ తనకు డేటింగ్ యాప్‌లో పరిచయమైనట్టు అర్చనే స్వయంగా వెల్లడించింది. గతంలో ఓ టీవీలో షోలో రిక్తో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఆమె అతడు డేటింగ్ యాప్‌లో పరిచయం అయినట్టు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా మలయాళ నటి అయిన అర్చన కవి.. తెలుగు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇందులో సినిమాతో ఈ భామ మంచి గుర్తింపు పొందింది.
Also Read: Vijaya Devarakonda: క్రేజీ కాంబో.. ఆ హిట్ డైరెక్టర్‌కి ఒకే చెప్పిన విజయ్..
నీలతామర(2009) అనే రీమేక్ చిత్రంతో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. అంతకు ముందు యూట్యూబర్గా సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్స్ర్గా ఆమె టీవీ షోలు హోస్ట్ చేస్తూ బుల్లితెరపై అడుగుపెట్టింది. అదే టైంలో నీలతామరతో వెండితెరపై మెరిసిన ఆమె మమ్మీ అండ్ మీ, బెస్ట్ ఆఫ్ లక్, సాల్ట్ అండ్ పెప్పర్, మజవిల్లినాట్టం వారే. అరవాన్, మోనై, అంగనే ఆనాయి వంటి చిత్రాల్లో నటించింది. పెళ్లి, విడాకుల కారణం సినిమాలకు కాస్తా గ్యాప్ తీసుకున్న అర్చన ఇటీవల ఐడెంటిటీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె కీ రోల్ పోషించింది.