E-Paper
Advertisement

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం
Advertisement

Palnadu: పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఓ గ్రామానికి చెందిన మహిళ భర్తతో విడాకులు తీసుకుని, తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. అయితే, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అర్ధరాత్రి మాట్లాడాలంటూ ఆ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి గ్రామ శివారుకు రప్పించాడు.

అక్కడికి చేరుకునే సరికే ప్రియుడు, అతని సోదరుడు పూర్తిస్థాయిలో మద్యం మత్తులో ఉన్నారు. ఒంటరిగా వచ్చిన సదరు మహిళను చూసి ఇద్దరూ కలిసి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఘోరానికి ఒడిగట్టారు. మొబైల్‌లో వీడియోలు తీస్తూ ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

Advertisement

ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు ఒక గ్రామ సచివాలయ ఉద్యోగి కావడం గమనార్హం. కేవలం ఈ ఘటనే కాకుండా, గతంలోనూ అతనిపై పలు మోసపూరిత కేసులు నమోదైనట్లు స్థానికులు చెబుతున్నారు. కామాంధుల చేతిలో దారుణానికి గురైన ఆ బాధితురాలు ప్రస్తుతం తీవ్ర భయాందోళనల నడుమ న్యాయం కోసం ఎదురుచూస్తోంది.

Also Read: వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×