Manchu Manoj:గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో గొడవలు రోడ్డుకెక్కిన విషయం తెలిసిందే. తండ్రీ కొడుకులు(మోహన్ బాబు – మంచు మనోజ్) ఒకరిపై ఒకరు కేసు నమోదు చేసుకోవడం.. అన్నదమ్ముల (మంచు విష్ణు – మంచు మనోజ్) మధ్య వాగ్వాదం అన్నీ కూడా అందరిని ఆశ్చర్యపరిచాయి. ఇక వీరు జన్మలో కలవరు అని అందరూ అనుకుంటూ ఉండగా.. అటు మంచు మనోజ్ (Manchu Manoj) మాత్రం తన ఫ్యామిలీతో తన తండ్రితో కలవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నం సఫలం అయ్యేలా కనిపిస్తోంది. దీనికి కారణం మంచు విష్ణు (Manchu Vishnu) కొడుకు అవ్రామ్ (Manchu Avraam) అని చెప్పాలి. ఒక అవార్డుతో తండ్రి – బాబాయిని కలపబోతున్నారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన అవ్రామ్..
మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీగా ఇటీవల తెరకెక్కిన మూవీ కన్నప్ప (Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh kumar Singh) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) , కాజల్ అగర్వాల్(Kajal Agarwal), అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తోపాటు భారీ తారాగణం భాగమయ్యింది. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించకపోయినా.. విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది అని చెప్పవచ్చు.. ఈ చిత్రం ద్వారానే విష్ణు కూతుర్లు అరియానా , వివియానాతో పాటు కొడుకు అవ్రామ్ కూడా వెండితెరకు పరిచయమయ్యారు. సినిమా మొదట్లోనే అవ్రామ్ క్యారెక్టర్ ను రివీల్ చేశారు. వెండితెరపై చేసింది మొదటి సినిమానే అయినా ప్రేక్షకులను మాత్రం తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకున్నారు అవ్రామ్.
అవార్డు అందుకున్న అవ్రామ్..
తన నటనతో మెప్పించిన అవ్రామ్ కి తాజాగా ‘సంతోషం ఫిలిం అవార్డ్స్’ లో భాగంగా అవార్డు లభించింది.. అవార్డు అందుకున్న తర్వాత..” కృతజ్ఞతలు తెలుపుతూ మళ్లీ మీ ముందుకు వస్తానని” తెలిపారు. ఇదే వేదికపై అటు మంచు విష్ణు కూడా మాట్లాడుతూ.. “అంతా ఆ పరమేశ్వరుడి దయ” అంటూ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ కూడా ఆయన షేర్ చేయడం జరిగింది. అంతేకాదు బెస్ట్ యాక్టర్ విభాగంలో విష్ణు కి కూడా అవార్డు లభించింది.
మంచు విష్ణును కోట్ చేసిన మంచు మనోజ్..
ఇకపోతే అవ్రామ్ కి అవార్డు రావడంతో మంచు మనోజ్ స్పందించడం ఇక్కడ విశేషం అని చెప్పవచ్చు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తాజాగా తన ఎక్స్ వేదికగా..” కంగ్రాట్స్ అవ్రామ్.. నిన్ను చూస్తుంటే నాకు మరింత గర్వంగా ఉంది. నువ్వు ఇలాగే మరింత రాణించాలి.. అన్న మంచు విష్ణు, నాన్న మోహన్ బాబు గారితో కలిసి అవార్డు అందుకోవడం మరింత ప్రత్యేకం” అంటూ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంమే కాకుండా ఇక్కడ తన అన్నయ్య మంచు విష్ణు పేరును కూడా మెన్షన్ చేస్తూ అన్నయ్య అని పోస్ట్ పెట్టడంతో ఇక అంతా సర్దుకున్నట్టేనా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
మంచు విష్ణు రిప్లై కోసం ఫాన్స్ ఎదురుచూపు..
మరి కొంతమంది హమ్మయ్య అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోయారు అంటూ పోస్ట్ పెడుతున్నారు. ఇకపోతే కన్నప్ప విడుదల సమయంలో మంచు మనోజ్ తన అన్నయ్య మంచు విష్ణు పేరును ప్రస్తావించలేదు.. దాంతో గొడవలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు తన అన్నయ్య కొడుక్కి అవార్డు రావడంతో తన అన్నయ్య పేరును కూడా ప్రస్తావించడం వైరల్ గా మారింది. మరి దీనిపై మంచు విష్ణు కూడా స్పందిస్తే బాగుంటుంది అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Congratulations Avram ❤️❤️❤️…..so so proud of you my boy…. Keep shining nannaaaa 😘😘😘
This is so special with @IvishnuManchu anna and Nanna @themohanbabu garu also receiving this award …Lots of love ❤️❤️#SantoshamFilmAwards https://t.co/2IPOHHDRmN— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 17, 2025