War 2 Story:ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR ) తొలిసారి హిందీలో నటిస్తున్న చిత్రం వార్ 2 (War 2). భారీ అంచనాల మధ్య ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ క్యారెక్టర్ లను రివీల్ చేశారు. ముఖ్యంగా ఇద్దరు యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు. పైగా వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా ట్రైలర్ అలా రిలీజ్ అయిందో లేదో ఇలా సోషల్ మీడియాలో స్టోరీ మొత్తం బయటకు రావడంతో సినిమాపై ఒక రకమైన అంచనాలు కూడా పెరిగిపోయాయని చెప్పవచ్చు.
వార్ 2 సినిమా స్టోరీ రివీల్..
ఇక వార్ 2 సినిమా స్టోరీ విషయానికి వస్తే.. వార్ మొదటి పార్ట్ తర్వాత ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) ఇండియాకి రాకుండా విదేశాలలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు. దీనికి కారణం.. దేశం కోసం అన్ని కాదనుకొని వీరోచితంగా పోరాడుతాడు. కానీ చివరికి తనకు ఎటువంటి గుర్తింపు లేదని భావించి, అటు కుటుంబాన్ని, ఇటు దేశాన్ని, మంచి, చెడులను ఆఖరికి ప్రాణంగా ప్రేమించిన ప్రేయసిని కూడా వదులుకొని విదేశాలలోనే సెటిల్ అయిపోదామని నిర్ణయించుకుంటాడు. దీనికి తోడు అదే సమయంలో ఇండియాకి కాస్త వ్యతిరేకంగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కబీర్ ని పట్టుకోవడానికి మరో మోస్ట్ వైలెంట్ ఏజెంట్ అయిన విక్రమ్(ఎన్టీఆర్) ను ఇండియా రంగంలోకి దింపుతుంది. అయితే ఇక్కడ నెగటివ్ షేడ్స్ ఉన్న సోల్జర్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు.
ఆ విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..
దేశం కోసం ఎంతో పోరాటం చేసిన కబీర్ ను భారత్ ఎందుకు పట్టుకోవాలి అనుకుంది ? ఏజెంట్ విక్రమ్ లో ఎందుకు నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి? అనే విషయం తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే. ఇకపోతే కబీర్ ను పట్టుకునే నేపథ్యంలో వీరి మధ్య జరిగే యుద్ధమే వార్. ఇకపోతే ఈ సినిమాలో పెద్దగా ట్విస్ట్ లు ఏమీ లేకపోయినా వీరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ కోసమే సినిమా చూడాలని ఆడియన్స్ కూడా చెబుతున్నారు. ఇక భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న విడుదల కాబోతున్న ఈ సినిమాతో వీరిద్దరూ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి.
వార్ 2 సినిమా నటీనటులు..
ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ విలన్ గా రాబోతున్న చిత్రం వార్ 2. ప్రముఖ బ్యూటీ కియారా అద్వానీ(Kiara advani) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నారు.
వార్ 2 Vs కూలీ..
ఇకపోతే ఈ వార్ 2 చిత్రానికి పోటీగా లోకేష్ కనగరాజు(Lokesh Kanagaraj) దర్శకత్వంలో వస్తున్న కూలీ (Coolie ) సినిమా కూడా అదే రోజు విడుదల కాబోతోంది. రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నాగార్జున(Nagarjuna ), ఉపేంద్ర (Upendra), శృతిహాసన్ (Shruti Haasan) తదితరులు భారీ తారాగణంతో విడుదల కాబోతోంది ఈ సినిమా. ఇక రెండు చిత్రాలు ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధం అవుతున్నాయి. మరి ఈ రెండు చిత్రాలలో ఏ సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.
ALSO READ:Pawan Kalyan HHVM : మరో వివాదంలో చిక్కుకున్న వీరమల్లు.. పవన్ సారీ చెప్పాల్సిందే ?