Hari Hara Veera Mallu :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల చేసిన తొలి చిత్రం హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu). ప్రీమియర్ షో తోనే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న హరిహర వీరమల్లు జూలై 24న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. అటు ప్రీమియర్స్ తోనే భారీ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా మొదటి రోజే భారీగా కలెక్షన్లు వసూలు చేసిందని సమాచారం. ఇదిలా ఉండగా విజయ పరంపర కొనసాగిస్తూ దూసుకుపోతున్న ఈ చిత్రం ఇప్పుడు చిక్కుల్లో పడింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ (K.Ramakrishna)తెలిపారు.
చిక్కుల్లో పడ్డ వీరమల్లు.. పవన్ సారీ చెప్పాల్సిందే..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చారిత్రక వాస్తవాలను వక్రీకరించి తీశారు అని మండిపడ్డారు. “1355లో వీరమల్లు మరణిస్తే.. 1591లో నిర్మించిన చార్మినార్ వద్ద ఆయన ఎలా యుద్ధం చేశారు?” అని ప్రశ్నించారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలి అని.. కచ్చితంగా సారీ చెప్పాల్సిందే అంటూ రామకృష్ణ కోరారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.
అడుగడుగునా అవాంతరాలే..
ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో ప్రారంభమైంది. కొంతభాగం షూటింగ్ కూడా పూర్తయింది. కానీ కరోనా రెండుసార్లు రావడం, లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా అవడం వల్ల డేట్స్ కేటాయించలేకపోయారు. అలా స్టాప్ అయిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ జ్యోతి కృష్ణ చేతుల్లోకి పడి ఎట్టకేలకు పూర్తి చేసుకొని ఇప్పుడు విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలైనా సరే ఇంకా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలు వక్రీకరించి తీశారు అని ఇప్పుడు సారీ చెప్పాలని కోరుతున్నారు. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య చాలా రోజుల తర్వాత విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కొంటుండడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమా విశేషాలు..
పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా నటించారు. ఇందులో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో నటించారు.అనసూయ, సునీల్ , నాజర్, సుబ్బరాజు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఒక మొదటి పార్ట్ తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్ర బృందం.. రెండవ భాగంతో అంతకుమించి రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నారని సమాచారం.. ప్రస్తుతం ఈ సినిమా ఇప్పుడు సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది.
also read:HBD Nara Rohit : వెనుక కొండంత బ్యాక్ గ్రౌండ్.. పైగా ఆ టాలెంట్ కూడా.. కానీ సక్సెస్ మాత్రం జీరో!