BigTV English
Advertisement

Mirai:  ‘మిరాయ్’ లో ఎవరికి ఎంత రెమ్యూనరేషన్?..అతనికే ఎక్కువ..?

Mirai:  ‘మిరాయ్’ లో ఎవరికి ఎంత రెమ్యూనరేషన్?..అతనికే ఎక్కువ..?

Mirai: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ గతంలో హనుమాన్ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. తాజాగా విజువల్ వండర్ మూవీ మిరాయ్ తో నిన్న థియేటర్లలోకి వచ్చేసాడు. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియ కీలక పాత్రల్లో నటించారు.. ఇందులోమంచు మనోజ్ కూడా ప్రత్యేక పాత్రలో నటించాడు. మిరాయ్‌లో ఈ మూడు పాత్రలే చాలా కీలకంగా ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్‌ రితికా నాయర్‌ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది.. మొదటి షోతోనే మంచి టాక్ పడింది. దాంతో కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదంతా పక్కనపెడితే ఈ మూవీలో ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ అన్నది ఆసక్తిగా మారింది.


తేజా రెమ్యూనరేషన్..?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ కోసం రూ. 60 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ ఔట్‌ పుట్‌ చూస్తే 300 కోట్లు ఖర్చు చేశారేమో అన్న సందేహం కూడా కలుగుతుంది. మిరాయ్ కోసం తేజ సజ్జా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని భావించినా.. నిజానికి అది భిన్నంగానే ఉంటుందని తెలుస్తుంది. హనుమాన్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్‌నే మిరాయ్‌కు కూడా తీసుకున్నానని ఒక వేదికపై చెప్పారు.. ప్రస్తుతం ఆయన రెమ్యూనరేషన్ అయితే చెప్పలేదు కానీ హిట్ అయితే మంచి అమౌంట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. అది కేవలం నిర్మాత ఇష్ట ప్రకారంగా తీసుకునే నిర్ణయం మాత్రమేనని అన్నారు.. మరి ఎంత అనేది తెలియాల్సి ఉంది..

ఏంటి.. మనోజ్ కే ఎక్కువ..?

గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ హనుమాన్ కు తేజా 2 కోట్లు తీసుకున్నారు. అదేవిధంగా ఈ సినిమాకి కూడా రెండు కోట్లకు పైగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకనుంచి ఆయన నటించనున్న కొత్త సినిమాలకు సుమారు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్‌ తీసుకోనున్నట్లు టాక్‌. జై హనుమాన్ మూవీకి కూడా రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకు గాను మంచు మనోజ్ కి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.. దాదాపు 3 కోట్లకు పైగా వసూల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రియ మాత్రం రూ. 2 కోట్ల వరకు అందుకున్నారని టాక్‌.. అలాగే హీరోయిన్ రితికా నాయక్ 50 లక్షలు అందుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్లు ఏమాత్రం ఉన్నాయో తెలియాల్సి ఉంది..


కలెక్షన్ల విషయానికొస్తే.. 

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. విజువల్ వండర్ గా తనకి ఎక్కిన ఈ చిత్రాన్ని చూసేందుకు జనాలు ఆసక్తి కనపరుస్తున్నారు.. మొదటి రోజున భారీగా ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ రెండో రోజు కూడా అదే విధంగా కొనసాగుతుందని తెలుస్తుంది. గంటకు 15 వేల టికెట్లు అమ్ముడు అవుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తుంటే ఈ వీకెండ్ కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..

Related News

The Girl Friend Censor Review : రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సెన్సార్ రివ్యూ… ఏకంగా జాతీయ అవార్డే

Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్  ఫైర్ అవుతున్న ఆ హీరో ఫ్యాన్స్.. ఏమైందంటే?

Hyper Aadi: హైపర్‌ ఆది చంపేస్తానంటూ బాలయ్య వార్నింగ్‌.. అసలేం జరిగిందంటే!

Prasanth Varma : డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మకు కోట్ల రూపాయల అడ్వాన్స్… ఫైనల్‌గా ఓపెన్ అయిన నిర్మాత

Salman Khan: దిల్ రాజుతో డీల్ కుదుర్చుకున్న సల్మాన్ ఖాన్..ఆ డైరెక్టర్ తో కొత్త సినిమా?

Abishan Jeevinth: ఘనంగా టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ వివాహం.. ఫోటోలు వైరల్!

Mass Jathara Business : మాస్ జాతర బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఇన్ని కోట్లు రాబాట్టాల్సిందే

Sambarala Yeti Gattu: సంబరాల ఏటి గట్టు ఆగిపోయిందా.. మళ్లీ ఏమైంది ..?

Big Stories

×