BigTV English
Advertisement

AUS vs IND: హ‌ర్షిత్ రాణా ఊచ‌కోత‌.. 104 మీట‌ర్ల సిక్స‌ర్..ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

AUS vs IND: హ‌ర్షిత్ రాణా ఊచ‌కోత‌.. 104 మీట‌ర్ల సిక్స‌ర్..ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

AUS vs IND:  టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 2nd T20I ) మధ్య ఇవాళ రెండవ టి20 జరుగుతున్న సంగతి తెలిసిందే. మెల్ బోర్న్‌ వేదికగా జరుగుతున్న ఈ రెండో టి20 మ్యాచ్ లో టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. కేవలం 125 పరుగులకే కుప్పకూలింది టీం ఇండియా. 18.4 ఓవర్లు ఆడిన టీమిండియా… 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 126 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది.


Also Read: Renuka Singh Thakur: టీమిండియా లేడీ క్రికెట‌ర్ ను అవ‌మానించిన పాకిస్తాన్‌..ఫాస్ట్ బౌలర్ కాదంటూ ట్రోలింగ్‌

104 మీటర్ల సిక్సర్ తో దుమ్ము లేపిన హర్షిత్ రాణా

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 2nd T20I ) మధ్య జరిగిన రెండో టి20 మ్యాచ్ లో అభిషేక్ శర్మతో పాటు హర్షిత్ రాణా అద్భుతంగా రాణించారు. ఫాస్ట్ బౌలర్ గా పేరు గాంచిన హర్షిత్ రాణా, ఇవాళ్టి మ్యాచ్ లో కాస్త ముందు బ్యాటింగ్ చేశాడు. 40 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో… హర్షిత్ రాణాకు ప్రమోషన్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే వచ్చిన అవకాశాన్ని హర్షిత్ రాణా ( Harshit Rana) వినియోగించుకున్నాడు. ఈ మ్యాచ్ లో 33 బంతులు ఆడిన హర్షిత్ రాణా 35 పరుగులు చేశాడు. ఇందులో మూడు బౌండరీలు అలాగే ఒక సిక్సర్ కూడా ఉంది. ఈ సిక్సర్ 104 మీటర్ల ఎత్తుకు వెళ్లడం గమనార్హం. ఇక అటు టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌ 37 బంతుల్లో 68 పరుగులు చేసి దుమ్ము లేపాడు.  ఇక త‌న ఇన్నింగ్స్ లో 8 బౌండ‌రీలు, 2 సిక్స‌ర్లు ఉన్నాయి. 187 స్ట్రైక్ రేట్ తో ర‌ఫాడించాడు అభిషేక్ శ‌ర్మ‌. కానీ మిగతా బ్యాటర్లు సపోర్ట్ చేయకపోవడంతో టీమ్ ఇండియా తక్కువ పరుగులు మాత్రమే చేయగలిగింది.


అటు టీమిండియా స్టార్ ఆటగాడు శుభామ‌న్ గిల్ ఐదు పరుగులు చేయగా వికెట్ కీపర్ సంజూ శాంస‌న్‌ రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆదుకుంటాడు అనుకున్న సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడకుండా ఒకే ఒక్క పరుగుకు పెవిలియన్ బాట పెట్టాడు. తిలక్ వర్మ డక్ అవుట్ కాగా.. అక్షర్ పటేల్ అనవసర పరుగుకు వెళ్లి రనౌట్ అయ్యాడు. శివం దూబే నాలుగు పరుగులకే వికెట్ కోల్పోయాడు. అటు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా 0 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ నాలుగు ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. జేవియర్ బార్ట్‌లెట్ రెండు వికెట్లు తీయగా నాథన్ ఎల్లిస్ మరో రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కస్ స్టోయినీస్‌ ఒకే ఒక్క వికెట్ తీశాడు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చ‌డంతో బ్యాట‌ర్లు విఫ‌లం అయ్యార‌ని క్రీడా విశ్లేష‌కులు చెబుతున్నారు. గౌత‌మ్ గంభీర్ చెత్త నిర్ణ‌యాల వ‌ల్లే టీమిండియా ఆలౌట్ అయింద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: SHREYAS IYER: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్.. క‌న్నీళ్లు పెట్టుకోవాల్సిందే

 

Related News

Pro Kabaddi Final: ప్రో క‌బడ్డీ ఛాంపియ‌న్ గా ద‌బాంగ్ ఢిల్లీ…ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

Gambhir: గంభీర్‌ ఓ చీడ పురుగు.. బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చ‌డంపై ట్రోలింగ్‌, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా దించుకో!

AUS vs IND: గంభీర్ త‌ప్పుడు నిర్ణ‌యాలు…రెండో టీ20లో ఆస్ట్రేలియా విజ‌యం

Jemimah: ధోని బ్యాట్ కంటే, నా బ్యాట్ బరువే ఎక్కువ.. జెమిమా కామెంట్స్ వైరల్

Aus vs Ind, 2nd T20I: టాస్ ఓడిన టీమిండియా..అర్ష‌దీప్ కు మ‌రోసారి నిరాశే..తుది జ‌ట్లు ఇవే

Rishabh Pant: రిషబ్ పంత్ చిలిపి పనులు.. తోటి ప్లేయర్ పై పడుకొని మరి.. కామాంధుడు అంటూ ట్రోలింగ్!

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మపై దారుణంగా ట్రోలింగ్.. ఇదేం బ్యాగ్ రా అంటూ

Big Stories

×