 
					Abishan Jeevinth: ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో పెళ్లి భాజలు మోగుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా శుభవార్తలను తెలియజేస్తూ అభిమానులను సంతోష పరుస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు తల్లితండ్రులుగా మారిపోయారు మరి కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. నేడు పలువురు సెలబ్రిటీల పెళ్లి వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరో హీరోయిన్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్, సిరి లెల్లా వివాహం గత రాత్రి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తాజాగా మరొక దర్శకుడు కూడా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. యూట్యూబర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి తన నటనతో, దర్శకుడిగా అవకాశాలు అందుకొని ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో డైరెక్టర్ అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) ఒకరు.
టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family) సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ యువ దర్శకుడు తాజాగా వివాహం చేసుకున్నారు గత మూడు సంవత్సరాలుగా అఖిల(Akhila) అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న అభిషన్ నేడు పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు. వీరి వివాహం చెన్నైలోనే పోయేస్ గార్డెన్ లో జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిన్న వయసులోనే దర్శకుడుగా మంచి సక్సెస్ అందుకున్న అభిషన్ నటుడిగా కూడా మెప్పించారు టూరిస్ట్ ఫ్యామిలీలో ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించారు.
ఇలా నటుడిగా కూడా మంచి పేరు సంపాదించుకోవడంతో ఏకంగా రజనీకాంత్ కుమార్తె నిర్మిస్తున్న సినిమాలో హీరోగా కూడా అవకాశం అందుకున్నారు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా విషయానికి వస్తే కేవలం 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 80 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే.
పెళ్లికి గిఫ్టుగా బీఎండబ్ల్యూ కారు..
ఇలా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ మాగేష్ రాజ్ డైరెక్టర్ అభిషన్ పెళ్లికి కానుకగా ఏకంగా రూ.50 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందజేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పెళ్లి వేడుకలో భాగంగా అతికొద్దమంది సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే సందడి చేశారు. ఇక గురువారం నిర్వహించిన రిసెప్షన్ కార్యక్రమంలో కోలీవుడ్ సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.