 
					Prashanth varma: ప్రశాంత్ వర్మ (Prashanth Varma)ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించిన హనుమాన్(Hanuman) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఈ సినిమా హిట్ కావడంతో ఎంతో మంది నిర్మాతలు ఈయనకు ముందుగానే అడ్వాన్సులు చెల్లించారని వార్తలు వచ్చాయి.
ఇలా ప్రశాంత్ వర్మ కు అడ్వాన్స్ చెల్లించిన నిర్మాణ సంస్థలలో డీవీడీ ఎంటర్టైన్మెంట్ (DVV Entertainments)కూడా ఉందని ఈ నిర్మాణ సంస్థ నుంచి కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇలా నిర్మాతల నుంచి ఈయన తీసుకున్న అడ్వాన్స్ ఒక స్టూడియోలో పెట్టుబడిగా పెట్టారని అయితే ఇప్పుడు సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తమ అడ్వాన్స్ వెనక్కి తిరిగి ఇవ్వాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో డివీవీ ఎంటర్టైన్మెంట్ స్పందించారు.
ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ అధికారకంగా ఈ విషయంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తాము ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్ చెల్లించాము అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. మా నిర్మాణ సంస్థ నుంచి ప్రశాంత్ వర్మకు ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని, అలాగే ఎలాంటి అగ్రిమెంట్లు కుదుర్చుకోలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాకు తాము ఒక్కటే విన్నవిస్తున్నాము ఇలాంటి వార్తలను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ప్రచారం చేసేటప్పుడు నిజాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాము అంటూ క్లారిటీ ఇచ్చారు.
— DVV Entertainment (@DVVMovies) October 31, 2025
ఇలా ప్రశాంత్ వర్మ కోట్ల రూపాయల అడ్వాన్స్ విషయంపై డివివి నిర్మాణ సంస్థ స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలలో నిజం లేదని స్పష్టం అవుతుంది. ఇక ప్రశాంత్ వర్మ సినిమాల విషయానికి వస్తే హనుమాన్ సినిమా ఎంతో అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈయన ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జై హనుమాన్(Jai Hanuman) సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రశాంత్ వర్మ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జ నటిస్తున్నారా? లేదా కొత్త వారిని ఈ సినిమాలో భాగం చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల తేజ సజ్జ మిరాయ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నారు.
Also Read: Salman Khan: దిల్ రాజుతో డీల్ కుదుర్చుకున్న సల్మాన్ ఖాన్..ఆ డైరెక్టర్ కొత్త సినిమా?