 
					Mass Jathara Business :మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే తాజాగా ఆయన ‘ మాస్ జాతర’ సినిమాతో నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోలు పడనున్నాయి. మాస్ మహారాజా రవితేజ హీరోగా, శ్రీ లీలా హీరోయిన్గా.. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఒక మోస్తారు అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రచయితగా కొనసాగిన భాను భోగవరపు ఇప్పుడు దర్శకుడిగా మారడంతో అందరిలో అంచనాలు కూడా పెరిగిపోయాయని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది? ఎంత రాబడితే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్తుంది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఇప్పటివరకు మాస్ జాతర బిజినెస్ రూ.20 కోట్లు నెట్ జరగగా .. రూ.40 కోట్ల షేర్ వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే.. రూ.21 కోట్ల నెట్ , రూ.42 కోట్ల గ్రాస్ రావాలి. అసలు బాహుబలి: ది ఎపిక్ అంటూ 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా ఫీవర్ జనాలలో పట్టుకుంది అని చెప్పవచ్చు.. మరి ఇలాంటి సమయంలో రవితేజ మాస్ జాతర సినిమాతో గట్టెక్కుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ సినిమా గట్టెక్కాలి అంటే అంతకుమించి మౌత్ టాక్ ఉండాలి. మరి ఉన్నది ఒక్కరోజు.. ఈ గ్యాప్ లో రవితేజ ఏ విధంగా తన సినిమాపై ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో చూడాలి.
also read:Bigg Boss: ఘనంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?
మాస్ మహారాజా రవితేజ సినిమాల విషయానికి వస్తే… గత కొంతకాలంగా ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు , ఈగల్ వంటి సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలేవి కూడా ఈయనకు విజయాన్ని అందించలేదు. ధమాకా సినిమాతో మళ్ళీ కం బ్యాక్ ఇచ్చిన రవితేజ.. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడు పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.. అయితే ఇప్పుడు సక్సెస్ కొట్టాలని ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. ఎప్పుడో విడుదల కావాల్సిన మాస్ జాతర పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. కనీసం ఈ వాయిదా లోనైనా ఒక మంచి రిలీజ్ డేట్ ను ఫైనల్ చేసుకొని ఉంటే బాగుండేది.
ఇలాంటి సమయంలో బాహుబలి రిలీజ్ అవ్వడంతో మాస్ జాతర కలెక్షన్ల పై భారీగా వేటు పడబోతుందని చెప్పవచ్చు. మరి ఇలాంటి సమయంలో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా మరొకవైపు దర్శకుడు భాను భోగవరపు కూడా… ఈ సినిమా రైల్వే పోలీస్ నేపథ్యంలో సాగుతుందని.. ఇందులో ఎవరు ఊహించని క్రైమ్ సస్పెన్స్ ట్విస్ట్ ఒకటి ఉందని.. ఖచ్చితంగా థియేటర్లలోనే దానిని ఆస్వాదించాలి అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. ఒకవేళ ఈరోజు ప్రీమియర్ షోలు పడ్డాక మౌత్ టాక్ బాగుంటే కచ్చితంగా ఈ సినిమాకి కలెక్షన్లు వస్తాయి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.