OTT Movie : డిఫరెంట్ గా ఏదైనా రొమాంటిక్ సినిమాని చూడాలనుకుంటే 2002లో విడుదలైన ‘సెక్రటరీ’ బెస్ట్ ఛాయిస్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా 2002 సుండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి, స్పెషల్ జ్యూరీ ప్రైజ్ ఫర్ ఒరిజినాలిటీ గెలుచుకుంది. టోరాంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా స్క్రీన్ అయింది. ఇందులో మానసిక స్థితి సరిగ్గా లేని ఒక యువతి ఒక లాయర్ దగ్గర సెక్రటరీగా జాయిన్ అవుతుంది. ఆ తరువాత స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమాని ఒంటరిగానే చూడండి. అరుపులు పెట్టించే సీన్స్ ఇందులో చాలానే ఉన్నాయి. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ కథ లీ హాలోవే అనే యువతితో మొదలవుతుంది. ఆమె ప్రస్తుతం మానసిక సమస్యలతో బాధపడుతుంటుంది. అంతే కాకుండా సెల్ఫ్-హార్మ్ కి అలవాటుకు గురై ఉంది. మెంటల్ ఆసుపత్రి నుండి డిష్చార్జ్ అయిన తర్వాత, ఆమె తన ఇంటికి తిరిగి వస్తుంది. అల్కహాలిక్ తండ్రి బర్ట్, ఓవర్‌ప్రొటెక్టివ్ తల్లి జోన్, ఆమెను నార్మల్ జీవితంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తారు. కానీ లీ ఇంకా అంత తేలిగ్గా ఈ సమస్య నుంచి బయటికి రాలేక పోతుంది. ఈ సమయంలో ఆమె టైపింగ్ కోర్స్ చేస్తుంది. హై స్కూల్ ఫ్రెండ్ పీటర్ తో డేటింగ్ మొదలుపెడుతుంది. కానీ అది అంత సవ్యంగా ముందుకు పోదు. లీ ఒక లాయర్ ఇ. ఎడ్వర్డ్ గ్రే కార్యాలయంలో సెక్రటరీగా ఉద్యోగం పొందుతుంది.
గ్రే ఒక్కొక్కటి పెర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకునే వ్యక్తి. అతని మునుపటి సెక్రటరీలు అందరూ త్వరగా ఈ ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతారు. లీ అతని డిక్టేషన్‌లు టైప్ చేస్తూ, అతని విచిత్రమైన రూల్స్‌ను అనుసరిస్తూ, క్రమంగా అతని రిథమ్‌లోకి వెళ్ళిపోతుంది. గ్రే ఆమె మీద ఇంట్రెస్ట్ చూపుతాడు. వీళ్ళ మధ్య ఒక అసాధారణ సంబంధం మొదలవుతుంది. లీ ఏదైనా తప్పు చేసినప్పుడు, గ్రే లీని టేబుల్ మీద వంగి, ఆమె చేతులు డెస్క్ మీద పెట్టి, కదలకుండా ఉండమని ఆదేశిస్తాడు. లీకి ఇది ఆమె సెల్ఫ్-హార్మ్ అలవాటుకు బదులుగా ఒక కొత్త ఎక్స్పెర్మెంట్ గా అనిపిస్తుంది. లీ కి ఇదొక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. వీళ్ళు సీక్రెట్‌గా మీటింగ్‌లు, ఇంటిమేట్ మూమెంట్స్ పంచుకుంటారు. కానీ గ్రే కి ఇది సరికాదనిపించి ఆమెను వదిలేస్తాడు. దీని వల్ల లీ చాలా డిప్రెస్డ్ అవుతుంది. కానీ ఆమె సెల్ఫ్-హార్మ్ ఆపేసి, తన జీవితాన్ని మార్చుకుంటుంది.
లీ పీటర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంటుంది. వెడ్డింగ్ డ్రెస్ కూడా ట్రై చేస్తుంటుంది. కానీ ఈ సమయంలో ఆమె గ్రేను ప్రేమిస్తున్నట్టు గ్రహిస్తుంది. వెడ్డింగ్ డ్రెస్‌తోనే గ్రే కార్యాలయానికి పరిగెత్తి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. అయితే గ్రే ఆమెను టెస్ట్ చేయడానికి ఆమెను తన చైర్‌లో కూర్చోబెట్టి, చేతులు-కాళ్లు కదలకుండా ఉండమని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. లీ రెండు రోజులు ఆహారం తినకుండా, వాష్‌రూమ్‌కు వెళ్లకుండా అక్కడే కూర్చుంటుంది. గ్రే తిరిగి వచ్చి, ఆమెను ప్రేమ నిజమని ఒప్పుకుంటాడు. ఈ సినిమా ఒక సంతోషకరమైన మూమెంట్ తో ముగుస్తుంది.
‘సెక్రటరీ’ 2002లో విడుదలైన అమెరికన్ ఎరోటిక్ రొమాంటిక్ చిత్రం. స్టీవెన్ షైన్‌బర్గ్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో మెగ్గీ గిలెన్‌హాల్ (లీ హాలోవే), జేమ్స్ స్పేడర్ (ఇ. ఎడ్వర్డ్ గ్రే) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 51 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.9/10 రేటింగ్ పొందింది. ఇది 2002 సెప్టెంబర్ 20న థియేట్రికల్ రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
Read Also : ఆచారాల పేరుతో అమ్మాయిలతో ఏకాంతంగా… సింగిల్ గా చూడాల్సిన మూవీ