 
					Salman Khan: ఒకప్పుడు సినిమాలు అంటే కేవలం ఒక భాషకు మాత్రమే పరిమితం అయ్యేది కానీ ఇటీవల కాలంలో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో కూడా సినిమాలు చేస్తూ సెలబ్రిటీలు స్థాయిలో మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు బాలీవుడ్ సినిమాలలో నటించగా బాలీవుడ్ హీరో హీరోయిన్లు కూడా తెలుగు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)మరోసారి తెలుగు దర్శక నిర్మాతలతో పని చేయటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. ఈయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇకపోతే దిల్ రాజు గతంలో హిట్, జెర్సీ లాంటి సూపర్ హిట్ సినిమాలను బాలీవుడ్ రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు .అయితే చిన్న విరామం తర్వాత మరోసారి బాలీవుడ్ హీరోలతో సినిమా చేయటానికి దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి ఈయన సినిమా చేయటానికి సిద్ధమయ్యారని, ఇప్పటికే సినిమాకు సంబంధించిన చర్చలన్నీ పూర్తి అయ్యాయని తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వంశీ పైడిపల్లి(Vamsi Paidipalli) దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించ బోతున్నారని ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించబోతున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా క్లాస్ మాస్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ఇక ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ కాకుండా సినిమా లాభాలలో వాటాలు తీసుకోబోతున్నారని కూడా తెలుస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం రీమేక్..
ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలతో పాటు షూటింగ్ వివరాలను కూడా వెల్లడించబోతున్నారు. ఇక దిల్ రాజు ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఈ సినిమాని అక్షయ్ కుమార్ తో చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా అక్షయ్ కుమార్ తో పాటు సల్మాన్ ఖాన్ తో కూడా మరో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక వంశీ పైడిపల్లి గతంలో అమీర్ ఖాన్ తో సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. అమీర్ ఖాన్ తో సినిమా క్యాన్సిల్ కావడంతో ఈయన సల్మాన్ ఖాన్ తో సినిమా చేయటానికి సిద్ధమయ్యారు.
Also Read: Abishan Jeevinth: ఘనంగా టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ వివాహం.. ఫోటోలు వైరల్!