E-Paper
Advertisement

Ram Pothineni: ఆ ఒక్కడి వలనే సెట్ లో కోపం వస్తుంది..

Ram Pothineni: ఆ ఒక్కడి వలనే సెట్ లో కోపం వస్తుంది..
Advertisement

Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే రామ్ నటిస్తున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. మిస్ శెట్టి..  మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు డైరెక్టర్ మహేష్ బాబు పి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న మహేష్.. తరువాత సినిమానే రామ్ తో చేసే ఛాన్స్ పట్టేశాడు. మైత్రీ మూవీ మేకర్స్. నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నవంబర్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన రామ్.. మునుపెన్నడూ లేనివిధంగా చాలా యాక్టివ్ గా తిరుగుతున్నాడు. సాంగ్స్ పాడడం, అన్ని ఈవెంట్స్ కి అటెండ్ అవ్వడం, కాలేజ్ ల చుట్టూ తిరగడం చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.

Advertisement

ఇంకోపక్క వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలనే కాకుండా పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో  యాంకర్ సెట్ లో రామ్ కి కోపం వస్తుందా.. ? ఏ విషయంపై వస్తుంది అన్న ప్రశ్నకు డైరెక్టర్ మహేష్ బాబు సమాధానమిచ్చాడు. రామ్ .. సెట్ లో ఒక సీరియస్ ఇంటెన్సివ్ సీన్ చేస్తున్నప్పుడు.. వెనుక నుంచి ఎవరో లైట్ ఆఫ్ ఉందా.. ఆ స్విచ్ వేయండి అంటూ అరుస్తూ ఉంటే పిచ్చ కోపం వచ్చేస్తుంది అని చెప్పగా.. అందుకు రామ్.. సెట్ లో  ఒక 200 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ సమయం, మూడ్.. ఇలాంటివేమీ ఆలోచించకుండా ఒకడు ఉంటాడు. వాడికి ఇవేమి అవసరం లేదు. వాడి పని వాడిదే. అలాంటివాళ్ళు ఉన్నప్పుడు కోపం వస్తుందిఅని చెప్పుకొచ్చాడు.

ఇక ఉపేంద్రగారికి ఎప్పుడు కోపం వస్తుంది అంటే.. పేకప్.. 9 గంటలకు చెప్పి.. 10 వరకు చేయిస్తాను. సార్ ఒక్క షాట్.. ఇంకో షాట్ అంటూ లాగుతూనే ఉంటా. అప్పుడు ఆయన వచ్చి ఎన్ని ఉన్నాయి. అవుతుందా అని అంటారు. అది కోపం అని చెప్పలేం కానీ, అంతకు మించి కోపం చూడను. ఆయన కూడా అర్ధం చేసుకుంటారు. ఎందుకంటే ఆయన కూడా డైరెక్టర్ కాబట్టి అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×