E-Paper
Advertisement

New Refund Rules: విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్, గంట ముందు టికెట్ క్యాన్సిల్ చేసినా..

New Refund Rules: విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్, గంట ముందు టికెట్ క్యాన్సిల్  చేసినా..
Advertisement

భారతీయ విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్. త్వరలోనే కొత్త రీఫండ్ రూల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రభుత్వం, విమానయాన సంస్థలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. చివరి నిమిషంలో అత్యవసర పరిస్థితుల కారణంగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే, మొత్తం టికెట్ ఛార్జీని కోల్పోతామని ఇప్పటి వరకు చాలా మంది టెన్షన్ పడేవారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణీకులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకుంటున్నాయి. రాబోయే రెండు, మూడు నెలల్లో కొత్త రీఫండ్ మోడల్‌ ను ప్రవేశపెట్టబోతున్నాయి.

ప్రయాణానికి 3 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే నో రీఫండ్

విమాన ప్రయాణానికి మూడు గంటల కంటే తక్కువ సమయం ముందు తమ టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణీకులకు రీఫండ్ ఇవ్వరు. కొత్త విధానం ప్రయాణీకులకు ఛార్జీలో ఎక్కువ శాతం రీఫండ్ పొందే అవకాశం కలిగించనుంది. టికెట్ ధరలో 80 శాతం వరకు రీఫండ్ అందించనున్నాయి విమానయాన సంస్థలు.  ఈ విధానాన్ని అమలు చేయడానికి విమానయాన శాఖ కార్యదర్శి విమానయాన సంస్థలతో చర్చలు జరపుతున్నారు. ఇందులో ప్రతి టికెట్ కొనుగోలుపై చిన్న ఇన్సూరెన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ ను విమానయాన సంస్థలు తీసుకుంటాయి. ఒక్కో టికెట్‌ కు దాదాపు రూ. 50 వరకు ప్రీమియం చెల్లిస్తాయి. ప్రయాణీకులు తమ టికెట్లను కొనుగోలు చేసేటప్పుడు ఈ అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు.

టికెట్ క్యాన్సిల్ చేస్తే పూర్తి రీఫండ్

Advertisement

అత్యవసర పరిస్థితుల కారణంగా ప్రయాణీకులు విమాన టికెట్లను రద్దు చేయాల్సి వస్తే, చాలా వరకు వాళ్లు రీఫండ్ పొందరు. తమ డబ్బు మొత్తాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. విమానయాన సంస్థలు అప్పుడప్పుడు ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉండి రాకపోతే, కొంత మేర రీఫండ్ ఇస్తారు. చివరి నిమిషంలో టికెట్ రద్దు చేసినందుకు రీఫండ్ లేకపోవడం గురించి ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసురాబోతుంది. ఈ మోడల్ ను సులభతరం చేయడానికి విమానయాన సంస్థలు ఇప్పటికే బీమా కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  ప్రయాణీకులు సరైన కారణాలతో టికెట్లను రద్దు చేసుకుంటే, ఇన్సూరెన్స్ ను విమానయాన సంస్థలు క్లెయిమ్ చేసుకుని, ప్రయాణీకులకు రీఫంగ్ అందించనున్నాయి.

ఆన్‌ లైన్ ట్రావెల్ పోర్టల్స్ టికెట్ బుకింగ్ సమయంలో ఆప్షనల్ బీమాను అందిస్తున్నప్పటికీ, కొద్దిమంది ప్రయాణీకులే దీనిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అందువల్ల, ఫిర్యాదులను తగ్గించడానికి, ప్రయాణీకుల భద్రతను పెంచడానికి విమానయాన సంస్థలు ఈ బీమాను టికెట్ ధరలో యాడ్ చేయాలని భావిస్తున్నాయి. రద్దు విధానాల ఆధారంగా బీమా కంపెనీలు ప్రీమియంలను నిర్ణయిస్తాయి.

Advertisement

పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (DGCA) టికెట్ రీఫండ్ల సమస్య పెరుగుతున్నట్లు గత కొంతకాలంగా గుర్తిస్తోంది.  వీటిలో ఆలస్యం, టెంపరరీ రీఫండ్స్, భవిష్యత్ ప్రయాణానికి మొత్తాన్ని క్రెడిట్ షెల్‌ గా అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త రీఫండ్ రూల్స్ తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. చివరి నిమిషంలో టికెట్లను రద్దు చేసినప్పటికీ వారు తమ డబ్బును కోల్పోకుండా చర్యలు తీసుకోబోతోంది.

Read Also: నమో భారత్ లో పార్టీలు, ఫోటో షూట్స్.. రైల్వే ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×