E-Paper
Advertisement

Vijay – Rashmika: విజయ్ – రష్మిక.. మొదట ఎవరు ప్రపోజ్ చేశారంటే?

Vijay – Rashmika: విజయ్ – రష్మిక.. మొదట ఎవరు ప్రపోజ్ చేశారంటే?
Advertisement

Vijay – Rashmika:సాధారణంగా ఒక సెలబ్రిటీ జంట ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు అంటే ఇద్దరిలో మొదట ఎవరు ప్రపోజ్ చేశారు? అనే వార్త కచ్చితంగా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇక రష్మిక మందన్న (Rashmika mandanna), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 8 సంవత్సరాల పాటు రహస్యంగా ప్రేమించుకుని ఎట్టకేలకు ఫిబ్రవరి 26 2026న రెండు మత సాంప్రదాయాల ప్రకారం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు .వివాహం అనంతరం సొంత గ్రామానికి వెళ్లిన విజయ్ దేవరకొండ అక్కడ తన భార్య రష్మిక మందన్నతో కలిసి నూతన గృహప్రవేశం చేసి, అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు.. ఆ తర్వాత గ్రామ ప్రజలందరికీ పసందైన విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే

రష్మిక – విజయ్.. మొదట ఎవరు ప్రపోజ్ చేశారంటే?

ఇకపోతే ప్రస్తుతం నేడు హైదరాబాదులో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల రిసెప్షన్ వేడుక ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ నాయకులు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న ప్రేమాయణంలో ఎవరు మొదట ప్రపోజ్ చేసారు అనే విషయానికి వస్తే..” రష్మికనే తనకు ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేసిందని విజయ్ దేవరకొండ స్వయంగా చెప్పినట్లు” ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న విజయ్ , రష్మిక తమ అభిమానులతో కలిసి లంచ్ చేశారు.” గ్రీట్ అండ్ మీట్ ” కార్యక్రమంలో వారిద్దరూ ఫ్యాన్స్ కి భోజనం స్వయంగా వడ్డించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి అయితే రష్మికనే ఫస్ట్ తనకు లవ్ ప్రపోజ్ చేసిందని, రెండు సినిమాలు చేసిన తర్వాత తాము ప్రేమలో పడినట్లు విజయ్ చెప్పారని అభిమానులు చెప్పుకొచ్చారు. మొత్తానికైతే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలో ఎవరు మొదట ప్రపోజ్ చేశారు అనే వార్తకి విజయ్ దేవరకొండ చెక్ పెట్టేశారు.

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ప్రేమాయణం..

Advertisement

ఇకపోతే 2018లో పరశురాం దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం ‘గీతా గోవిందం’. ఈ సినిమా ద్వారా వీరిద్దరూ తొలిసారి తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో జంటగా నటించి అబ్బురపరిచారు. ఇక ఈ జంట నటించిన తీరుకి వీరిద్దరూ నిజజీవితంలో జంట అయితే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకున్నారు. ఆ తర్వాత 2019లో మళ్లీ డియర్ కామ్రేడ్ సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాతనే ప్రేమలో పడ్డ వీరు ఇక ఎప్పటికప్పుడు మీడియా కంట పడకుండా చట్టపట్టలేసుకొని తిరుగుతూ అభిమానులలో అనుమానాలు రేకెత్తించారు. ఇక ఎప్పటికైనా తమ బంధాన్ని బయటపెడతారని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. కానీ ఈ జంట బయటపడలేదు. అయితే ఎనిమిదేళ్ల తర్వాత తమ బంధాన్ని బహిర్గతంగా ప్రకటించి సర్ప్రైజ్ చేశారు. అలా ఈ లవ్లీ రూమర్డ్ జంట ఎట్టకేలకు వైవాహిక బంధం లోకి అడుగు పెట్టింది.

also read: Chiranjeevi: విశ్వంభర కోసం చిరంజీవి మాస్టర్ ప్లాన్.. కనీసం ఇలా అయినా కలిసొస్తుందా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×