Irumudi Movie: రవితేజ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం ఇరుముడి(Irumudi). డైరెక్టర్ శివ నిర్వాణ (Siva Nirvana)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేషమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు విడుదల అయినప్పటికీ ఇరుముడి తుఫానులో ఇతర సినిమాలు కూడా కొట్టుకుపోయాయని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది.
ఇప్పటికే ఇరుముడి సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇలా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో ఊహించని విధంగా చిత్ర బృందానికి గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో విడుదల అయిన వెంటనే పైరసీ అవుతూ ఎంతోమంది సినిమాని వీక్షిస్తూ ఉన్నారు. ఇలా సినిమా పైరసీ ద్వారా చిత్ర నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సినిమా పైరసీలను అడ్డుకోవడానికి చిత్ర నిర్మాతలు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసిన పైరసీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇరుముడి సినిమాపై కూడా పైరసీ ప్రభావం పడిందని చెప్పాలి. థియేటర్లలో ఎంతో విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న ఈ సినిమాను ఏకంగా వీధులలో ప్రొజెక్టర్లు పెట్టి మరీ ప్రదర్శితం చేస్తున్నటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రొజెక్టర్ ద్వారా పైరసీలో ఇరుముడి సినిమాని వీక్షిస్తూ ఉన్నారు. ఈ ఫోటో మేకర్స్ ను కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలోనే పైరసీని కట్టడి చేయడానికి మూవీ టీం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమా విడుదల అయి దాదాపు 15 రోజులు అవుతున్న ఇప్పటికీ విజయవంతంగా ప్రసారమవుతుంది ఇందులో రవితేజ జోడిగా ప్రియా భవాని శంకర్ నటించి సందడి చేశారు.ఇక బేబీ నక్షత్ర నటన సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. రవితేజ గత కొంతకాలంగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు కానీ ఇరుముడి సినిమా మాత్రం రవితేజ సినీ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తదుపరి రవితేజ సినిమాలపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం రవితేజ పలు ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?