BigTV English

Telugu Audience : అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావాలి ?

Telugu Audience : అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావాలి ?

Telugu Audience : ఒకప్పుడు తెలుగు ప్రజలకు వినోదం అంటే కేవలం సినిమా మాత్రమే. అప్పుడప్పుడు ఊర్లలో వేసే సాంఘిక నాటకాలు, బుర్రకథలు అలాంటివన్నీ వినోదంగా ఉండేవి. కానీ సినిమాలు మాత్రం ఎప్పుడూ ఆడుతుండేవి. చూసిన సినిమాలనే పదేపదే చూస్తూ ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఎప్పటినుంచో ఉన్నారు. టీవీలు అరుదుగా ఉన్న రోజుల్లో సినిమా థియేటర్లన్నీ కూడా కిటకిటలాడేవి. టీవీలు వచ్చిన తర్వాత కూడా థియేటర్ కు వెళ్లడం చాలామంది ప్రేక్షకులు మానలేదు.


ఇప్పుడు మాత్రం థియేటర్స్ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఒక పెద్ద సినిమా వస్తే గానీ ఆడియన్స్ థియేటర్ కి రావట్లేదు. ఆడియన్స్ థియేటర్ కు రావడం మానేయడానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. దీని గురించి ఎంత చర్చించినా కూడా ఎన్నో కొన్ని విషయాలు మిగిలి ఉంటాయి. అసలు థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు తగ్గిపోవడానికి కారణాలు ఏంటి.?

ఓటిటి ప్లాట్‌ఫామ్స్


ఒకప్పుడు థియేటర్లో ఒక సినిమా చూస్తే, ఆ సూపర్ హిట్ సినిమా VCD రూపంలో మార్కెట్లోకి రావడానికి కనీసం 50 నుంచి 100 రోజులు సమయం పట్టేది. ఆ తర్వాత అది టీవీలో రావడానికి దాదాపు మరో 100 రోజులు పైనే పెట్టేది. ఒక సూపర్ హిట్ సినిమా టీవీలో వస్తుంది అంటే ఆ ఎక్సైట్మెంట్ ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయింది. కేవలం మూడు వారాలు ఎదురు చూస్తే చాలు థియేటర్లో చూసే సినిమా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తుంది అని సాధారణ ప్రేక్షకుడికి అర్థమయిపోయింది. అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేసాం కదా ఇంకో మూడు వారాలు వెయిట్ చేయలేమా అంటూ చాలామంది ఆగిపోతున్నారు.

టికెట్ రేట్లు

ప్రస్తుతం సినిమా టికెట్ రేట్లు దాదాపు 300 రూపాయలకు దగ్గరగా ఉన్నాయి. ఒకప్పుడు పది పైసలు, 50 పైసలు రూపాయి ఈ రేంజ్ లో టికెట్ ధరలు ఉండేవి. అప్పటి రోజుల్లో అదే ఎక్కువ. రోజులు మారుతున్న కొద్దీ అన్ని విషయాలు మారుతాయి అనడంలో తప్పులేదు. అయితే ఇప్పుడు మాత్రం టికెట్ రేట్లు మరీ దారుణంగా ఉన్నాయి. 300 రూపాయలు ఒక టిక్కెట్ కోసం కేటాయించాలి. అంటే ఒక ఫ్యామిలీలో నలుగురు వెళ్తే 1200 రూపాయలు అవుతుంది. ఈ 1200 రూపాయలకి మార్కెట్లో రైస్ బ్యాగ్ వస్తుంది. నిత్యవసర వస్తువులు కంటే కూడా సినిమా టికెట్ రేట్లు ఈ రేంజ్ లో ఉండడం అనేది కూడా కొంతమేరకు మైనస్.

కూల్ డ్రింక్స్ & స్నాక్స్ ధరలు

టికెట్స్ తో పాటు థియేటర్స్ లో ఉండే కూల్ డ్రింక్స్ & స్నాక్స్ ధరలు భరించలేనంతగా ఉన్నాయి. ఒక పర్సన్ మూవీకి మల్టీప్లెక్స్‌కి వెళ్తే టికెట్ ధర 300 నుంచి 350 రూపాయలు ఉంటుంది. అక్కడ ఇంటర్వెల్ టైంలో ఓ చిన్న కూల్ డ్రింక్, ఓ చిన్న స్నాక్ ప్యాకెట్ తీసుకుంటే వాటికి మరో 500 నుంచి 600 అవుతున్నాయి. అంటే ఒక పర్సన్‌కి ఆ మూడు గంటల్లో 800 నుంచి 900 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇవి సామాన్యులకు అతి భారీ మొత్తం.

స్టార్ హీరోలు సినిమాలు తగ్గించారు

ఒకప్పుడు స్టార్ హీరోలంతా విపరీతంగా సినిమాలు చేసేవాళ్ళు. సినిమా తప్ప ఇంకో ధ్యాస అప్పటి హీరోలకి ఉండేది కాదు. ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటివాళ్ళు సంవత్సరానికి కనీసం నాలుగు ఐదు సినిమాలు చేసేవాళ్ళు. ఒక హీరో సినిమా కాకపోయినా ఇంకో హీరో సినిమా అందుబాటులో ఉండేది. అలానే ఒక్కో సినిమా 50 రోజులు, వంద రోజులు ఆడిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు హీరోలు మాత్రం రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. ఆ రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మార్నింగ్ షో కి వస్తున్నాడు. దీనివలన థియేటర్ల పరిస్థితి మరి దారుణం. ఆంధ్రప్రదేశ్లో కొన్నిచోట్ల షో స్ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి.

ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్

మధ్యతరగతి కుటుంబంలో ఉన్న కొన్ని బాధలను మర్చిపోవడానికి సినిమా అనేది ఒక ఆయుధంగా ఉపయోగపడేది. అలానే ఒక ఫ్యామిలీ థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం అనేది ఒక పండగ. ఇప్పుడు ఇంట్లో టీవీ చేస్తే చాలు చాలా ఎంటర్టైన్మెంట్ షోస్ వచ్చేసాయి. నవ్వుకోవడానికి, పాటలకు, డాన్సులకు ఇలా దేనికవి సెపరేట్ గా షోస్ ఉన్నాయి. యూట్యూబ్ లో లక్షలుకొద్ది వీడియోలు ఉన్నాయి. ఒక నిమిషం డ్యూరేషన్ లో కథను చెప్పేసే రీల్స్ ఉన్నాయి. ఈ తరుణంలో 900 రూపాయలకు ఖర్చు పెట్టుకుని మూడు గంటల పాటు థియేటర్లో కూర్చోవాలి అంటే ఆడియన్స్ వస్తాడా.?

మలయాళం సినిమాల ఆదరణ

చాలామంది మాట్లాడుతూ మలయాళం సినిమాలను ఎంకరేజ్ చేస్తారు చూస్తారు అని మాట్లాడుతూ ఉంటారు. మలయాళం సినిమాలను చూసేది కేవలం ఓటీటి ప్లాట్ఫామ్స్ లోనే, ఏదో సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ చూసి ఆ సినిమాను మరికొంతమంది చూసి ఇంకొంతమందికి చెప్తారు. పెద్ద హీరోలు సినిమాలు విడుదలయితేనే థియేటర్ కి ఆడియన్స్ వస్తున్నారు. గట్టిగా మాట్లాడితే ఆ హడావిడి కూడా కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది.

కోట్లు ఖర్చు పెట్టడం కాదు… మార్పు జరగాలి

ప్రేక్షకుడు మళ్లీ థియేటర్ కు రావాలి అంటే కోట్లు ఖర్చుపెట్టి భారీ స్థాయి సినిమాలు చేయడం కాదు కాదు. తక్కువ బడ్జెట్లో తీసినా కూడా స్టార్ హీరోలు నిత్యం ప్రజలకు తమ వినోదంతో అందుబాటులో ఉంటే థియేటర్ కు రెగ్యులర్ గా ఆడియన్స్ రావడం మొదలుపెడతారు. మళ్లీ థియేటర్స్ కు పూర్వవైభవం వస్తుంది. కేవలం ఇది చేస్తే వస్తుంది అని చెప్పడం కాకుండా ఇంకా చాలా మార్పులు జరగాలి. వీటన్నిటి గురించి తెలుగు సినిమా పెద్దలు సరైన నిర్ణయాన్ని తీసుకుంటే సినిమా పరిశ్రమలో మార్పు వస్తుంది. లేదు అంటే చాలామంది దర్శకులు మళ్లీమళ్లీ చెప్పుతో కొట్టుకొని, నా సినిమా చూడండి అన్నా అని అడుక్కోవలసిన పరిస్థితి ఖాయం.

డైరెక్టర్లకు – నిర్మాతలకు ఇదే సమాధానం.

ఇటీవల ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే ఓ మూవీ రిలీజ్ అయింది. దీనికి డైరెక్టర్ మోహన్ శ్రీవత్స. ప్రమోషన్స్‌లో మూవీ నచ్చకపోతే, చెప్పుతో కొట్టుకుంటా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. సినిమా రిలీజ్ అయింది. ఆయన ఓ థియేటర్‌కి వెళ్తే పది మంది కూడా లేరట. దీంతో అప్‌సెట్ అయి… ప్రమోషన్స్‌లో చెప్పన దాని ప్రకారం.. తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరూ అతన్ని పాపం అంటూ సానుభూతి చూపిస్తున్నారు.

అలాగే, బిగ్ బాస్ షోతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న సోహెల్ మొన్నా ఆ మధ్య ఓ సినిమా చేశాడు. దానికి సేమ్ పరిస్తితి. థియేటర్‌కి ఎవరూ రాలేదు. దీంతో మీడియా ముందే… “థియేటర్‌కి వచ్చి సినిమా చూడండి అన్నా…” అంటూ కన్నీరు కూడా పెట్టుకున్నాడు. అప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అయింది.

ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే… సినిమా ఫెయిల్ అయిందా, పాస్ అయిందా ? అనేది కాదు.. అసలు థియేటర్‌కి జనాలు రాలేదు. ఎందుకు రాలేదు అంటే… పైన చెప్పిన కారణాలు అన్నీ. ఆడియన్స్ తప్పు కాదు… ఇండస్ట్రీని ఇలా మార్చేసిన, నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు, థియటేర్ల ఓనర్లు, బయ్యర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇంకా చాలా…

ముందు మీరు మారండి.. ఆడియన్స్‌పై నిందలు వేయడం కాదు. 

Related News

Kishkindapuri Censor: కిష్కంధపురి సెన్సార్… అంతలా ఏం ఉందయ్యా… ఆ సర్టిఫికేట్ ఇచ్చారు

HBD Pawan Kalyan: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెట్‌ ఫోటో లీక్‌ చేసిన రాశీ ఖన్నా.. పిక్‌ వైరల్‌

Samantha: రాజ్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత.. వీడియో వైరల్!

OG Glimpse: హైప్‌ పెంచుతున్న ‘ఓజీ’ గ్లింప్స్‌.. పవన్‌ లుక్‌కి గూస్‌బంప్సే.. చూశారా?

HHVM 2: వీరమల్లు పార్ట్ 2లో క్రిష్ సీన్స్… బిగ్ ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్!

Janhvi Kapoor: కొబ్బరి చెట్టు ఎక్కిన జాన్వీ, మలయాళీల ఆగ్రహం.. ఛీ ఇంత అవమానమా!

Big Stories

×