E-Paper
Advertisement

Uttar Pradesh: డీజే సౌండ్‌ ఎఫెక్ట్.. తట్టుకోలేక 140 కోళ్లు మృతి, యూపీలో షాకింగ్ ఘటన

Uttar Pradesh: డీజే సౌండ్‌ ఎఫెక్ట్.. తట్టుకోలేక 140 కోళ్లు మృతి, యూపీలో షాకింగ్ ఘటన
Advertisement

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. డీజే సౌండ్‌ తట్టుకోలేక దాదాపు 140 కోళ్లు మృతి చెందాయి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగ్రహానికి గురైన పౌల్ట్రీ ఫామ్ యజమాని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్లే..

యూపీలో షాకింగ్ ఘటన.. డీజే సౌండ్‌ ఎఫెక్ట్

Advertisement

ట్రెండ్ మారింది.. పార్టీలైనా, బర్త్ డే ఫంక్షన్లు, పెళ్లిళ్లు అయినా కచ్చితంగా డీజే సౌండ్ సిస్టమ్ ఉండాల్సిందే. లేకుంటా ఆ ఇంట ఫంక్షన్ల సందడి పెద్దగా కనిపించదు. దీంతో డీజే సిస్టమ్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఒకరోజుకు డీజే నిర్వాహకులు ఎంత తీసుకుంటారు? అనేది కాసేపు పక్కనబెడదాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఊహించని ఘటన జరిగింది.

సుల్తాన్‌పూర్‌ జిల్లాలోని దరియాపూర్ గ్రామంలో పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్నాడు సబీర్ అలీ. ఈనెల 25న రాత్రి 9 గంటల సమయంలో బబ్బన్ విశ్వకర్మ ఫ్యామిలీకి చెందిన వివాహ ఊరేగింపు ఆ గ్రామం మీదుగా వెళ్లింది. అయితే ఊరేగింపులో డీజే సౌండ్ సిస్టమ్ నుంచి వచ్చిన తీవ్రమైన శబ్దం వచ్చింది. దాన్ని తట్టుకోలేక కోళ్ల ఫారంలోని కోళ్లు భయంతో వణికిపోయాయి.

Advertisement

 తట్టుకోలేక 140 కోళ్లు మృతి, యజమాని ఫిర్యాదు

ఆ సౌండ్‌కు తట్టుకోలేక ఫారమ్‌లోని 140 కోళ్లు మృతి చెందాయి. ఈ విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆ ఫిర్యాదులో డీజే ఆ శబ్దం చాలా తీవ్రంగా ఉందని, దాని కారణంగా కోళ్లు మరణించాయని ప్రస్తావించాడు.

అలీ ఫిర్యాదుతో పోలీసులు డీజే ఆపరేటర్ కవి యాదవ్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎస్‌హెచ్‌వో మహేంద్ర ప్రతాప్ సింగ్ నిర్ధారించారు. పరిమితిని మించి సౌండ్ పెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, కోళ్ల మృతికి డీజే సౌండే కారణమా? మరేదైనా కారణం ఉందా అనే విషయం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: బెంగళూరులో వరుణుడి బీభత్సం.. ఆసుపత్రి గోడ కూలి ఏడుగురు మృతి.. ముగ్గురు పసిపిల్లలు బలి!

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×