BigTV English

kota Student Missing : వారం రోజుల్లో రెండో విద్యార్థి అదృశ్యం..

kota Student Missing : వారం రోజుల్లో రెండో విద్యార్థి అదృశ్యం..
kota Student Missing

18-year-old NEET aspirant Yuvraj missing in Kota : కోచింగ్ హబ్‌గా పేరొందిన రాజస్థాన్‌లోని కోటలో మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. విద్యార్థుల మిస్సింగ్ కేసులకు సంబందించి గత 7 రోజుల్లో ఇది రెండోది. సికార్ జిల్లాకు చెందిన యువ్‌రాజ్(18) ఇక్కడ ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో నీట్‌ మెడికల్ ఎంట్రన్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కోటలోని ట్రాన్స్‌పోర్ట్ నగర్ ప్రాంతంలోని హాస్టల్‌లో ఉంటున్న యువ్‌రాజ్ శనివారం ఉదయం కోచింగ్ సెంటర్‌కు చేరుకున్నాడు.


Read more : బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి..

అప్పటి నుంచి అతని ఆచూకీ లేదు. అదీగాక అతను తన మొబైల్ ఫోన్‌ను హాస్టల్‌లో వదిలి రావడంతో అనుమానాలకు ఆస్కారం కలుగుతోంది. వారం రోజుల క్రితమే రచిత్
సంధ్య(16) అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ విద్యార్థి జేఈఈకి సిద్ధమవుతున్నాడు. ఓ పరీక్షకు హాజరైన అనంతరం అతను ఓ క్యాబ్ ఎక్కడం సీసీటీవీ ఫుటేజిలో నమోదైంది.


ఓ ఆలయాన్ని సందర్శించిన అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అదే చివరిసారిగా అతనిని చూడటం. ఆలయం వద్దే రచిత్ బ్యాగ్, మొబైల్ ఫోన్, గది తాళాలు, ఇతర వస్తువులు పోలీసులకు లభ్యమయ్యాయి. ఆ టీనేజర్ ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. మిస్సింగ్ విద్యార్థుల కోసం గాలింపు సాగుతోంది.

Tags

Related News

Viral Video: సెల్ఫీకి ఓ వ్యక్తి ప్రయత్నం.. తోసి తిట్టేసిన జయాబచ్చన్, వైరల్ వీడియో

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Big Stories

×