BigTV English

Chiranjeevi: భార్య కోసం చిరు కవిత.. టైమింగ్ తో పాటు రైమింగ్ అదరగోట్టేసిన మెగాస్టార్

Chiranjeevi: భార్య కోసం  చిరు కవిత.. టైమింగ్ తో పాటు రైమింగ్ అదరగోట్టేసిన మెగాస్టార్
celebrity news today

Chiranjeevi Wife Surekha Birthday: మెగాస్టార్ చిరంజీవి ఒకవైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే.. మరోవైపు తన ఫ్యామిలీతో సమయాన్ని ఎక్కువగా గడుపుతుంటారు. ఇందులో భాగంగానే తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని స్సెషల్ మూమెంట్స్‌ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు.


అయితే ఈ మధ్య చిరు తన ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా వెకేషన్లకు ప్లాన్ చేస్తున్నాడు. తనకు షూటింగ్స్ నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా ఏదో ఒక స్పెషల్ ప్లేస్‌కి తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఇటీవలే వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్య సురేఖతో అమెరికాకు వెళ్లాడు.

అయితే అందుకు సంబంధించిన విషయాన్ని కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఈ మేరకు భార్య సురేఖతో చిన్న ట్రిప్ అంటూ ఫ్లైట్‌లో ఆమెతో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అలా సినిమా షూటింగ్స్ నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో గడుపుతూ స్పెషల్ మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకుంటుంటాడు.


READ MORE: మెగాస్టార్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా.. షూటింగ్ ఆపి మరీ భార్యతో కలిసి..?

ఇక ఈ రోజు తన భార్య సురేఖ బర్త్ డే కావడంతో.. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆమెకు విషెస్‌ తెలిపాడు. ఈ మేరకు ఒక చిన్న కవితతో భార్య సురేఖకు విషెస్ చెప్పాడు. ‘నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ’ అంటూ ‘నా లైఫ్‌లైన్.. నా బలం సురేఖకు హ్యాపీ బర్త్‌డే’ అని రాసుకొస్తూ.. తన భార్య సురేఖతో దిగిన స్పెషల్ ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారుతోంది.

ఇకపోతే చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాకుండా ఈ మూవీ కోసం చిరు చాలా కష్టపడుతున్నాడు.

జిమ్ వర్కౌట్స్ అంటూ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. యంగ్ హీరోలకు సమానంగా ఎందులోనూ తీసిపోకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇందులో మెగాస్టార్‌కు జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తుంది.

READ MORE: చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పండగే

కాగా ఆమెతో పాటు ఇందులో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×