BigTV English

Chhattisgarh Encounter: భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి.

Chhattisgarh Encounter: భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు  మృతి.

 latest today news in india,


Maoists Exchange Fire Police Telangana Chhattisgarh Border: ఛత్తీస్‌గఢ్‌- మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గడ్చి రోలిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులకు ఎదురుపడ్డప్పుడు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. ఈరోజు ఉదయం 60మంది కమాండోలతో ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో ఆపరేషన్ నిర్వర్తిస్తుండగా ఎన్‌కౌంటర్ జరిగింది.

ఎన్‌కౌంటర్‌లో డీవీసీ సభ్యుడు వర్గీష్, డీవీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యుడు కురసం రాజు, ప్లాటూన్ సభ్యుడు వెంకటేష్ మృతి చెందారు. వీరిపై 36 లక్షల రూపాయలు రివార్డు ఉంది. ఘటన స్థలం నుంచి ఒక AK47, ఒక కార్బైన్, రెండు పిస్టళ్లతో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.


Also Read: కవితపై సుకేశ్ సంచలన ఆరోపణలు.. “తీహార్ జైలుకు స్వాగతం అక్కా”

ఈ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుల నుంచి ప్రాణహిత నదిని దాటి కొంతమంది నక్సలైట్లు  ప్రవేశించినట్టు సోమవారం మధ్యాహ్నం పోలీసులకు నిఘా వర్గాల ద్వారా సమచారం అందింది. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కొంతమంది నక్సెల్స్ కొన్ని చోట్ల దాడులకు వ్యూహారచన కోసం తెలంగాణ నుంచి గడ్చి రోలిలోకి ప్రవేశించినట్లు జిల్లా ఎస్పీ నీలోత్పల్ చెప్పారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఛత్తీస్‌గఢ్‌- మహారాష్ట్ర సరిహద్దులోని పోలీసులు సీ -60, సీఆర్పీఎప్ సంయుక్తంగా చర్యలు చేపట్టారు. అక్కడ కూబింగ్ నిర్వహిస్తున్న వారిపై నక్సలైట్లు విచక్షణారహితంగా కాల్పులు జరపగా నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి చెందారు.

Tags

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×