E-Paper
Advertisement

Kolkata Earthquake: దేశంలో భూకంపం.. కోల్‌కతాలో భారీ ప్రకంపనలు.. పరుగులు పెట్టిన జనం

Kolkata Earthquake: దేశంలో భూకంపం.. కోల్‌కతాలో భారీ ప్రకంపనలు.. పరుగులు పెట్టిన జనం
Advertisement

Kolkata Earthquake: దేశంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. బెంగాల్ లోని కోల్ కత్తా నగరంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టల్ స్కేలుపై 5.4 తీవ్రతో కదలికలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 1.22 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ లేదా మయన్మార్ లో ఈ భూకంప కేంద్రం నమోదై ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఫలితంగా కోల్ కతాతో పాటు బెంగాల్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రధానంగా కోల్ కతాలో భూకంప ప్రభావం ఉండటంతో నగరవాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఆఫీసులు, ఇళ్లు, షాపింగ్ మాల్స్ నుంచి బయటకు పరుగులు పెట్టారు.

Advertisement

మరోవైపు భూ ప్రకంపనలకు సంబంధించిన స్వీయ అనుభవాలను కోల్ కతా ప్రజలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. భూమి కంపించిన తీరును తెలియజేసే వీడియోలను నెట్టింట షేర్ చేస్తున్నారు. దీంతో ఆ దృశ్యాలు ఒక్కసారిగా ట్రెండింగ్ అవుతున్నాయి. గోడకున్న గడియాలు, ఫ్యాన్లు ఊగిపోవడం, వంటగదిలోని వస్తువులు కిందపడిపోయిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Also Read: Flipkart AC Deals: కొత్త ఏసీ కావాలా? మీకిదే గోల్డెన్ ఛాన్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లుచెదిరే ఆఫర్లు!

EMSC డేటా ప్రకారం.. మయన్మార్ లోని అక్యాబ్ సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూమికి 6-10 కి.మీ లోతులో ఇది సంభవించి ఉండొచ్చని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ అంచనా వేసింది. ఫలితంగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్ తో పాటు భారత్ లోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ దీని ప్రభావం కనిపించిందని స్పష్టం చేసింది.

Also Read: Botsa Health: బొత్స సత్యనారాయణకు అస్వస్థత.. ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర చికిత్స

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×