E-Paper
Advertisement

Botsa Health: బొత్స సత్యనారాయణకు అస్వస్థత.. ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర చికిత్స

Botsa Health: బొత్స సత్యనారాయణకు అస్వస్థత.. ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర చికిత్స
Advertisement

Botsa Health: వైసీపీ ముఖ్య నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హుటాహుటీనా హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నగరంలోని సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆయనకు అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బొత్స అనారోగ్యం నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు, శ్రేణులు కాస్త ఒత్తిడికి లోనైట్లు సమాచారం.

ఏపీ శాసనమండలిలో వైసీపీ తరపున ప్రతిపక్ష నేతగా బొత్స కొనసాగుతున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సమావేశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ గళాన్ని బొత్స వినిపిస్తున్నారు. తిరుపతి కల్తీ నెయ్యి అంశంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఆయన బలంగా తిప్పికొడుతూ వస్తున్నారు. అదే సమయంలో కూటమి పాలనలోని లోటుపాట్లను సైతం ఎత్తి చూపే ప్రయత్నం చేశారు.

Advertisement

Also Read: Instagram vs WhatsApp: మీ మొబైల్ డేటా త్వరగా అయిపోతుందా? ఆ ఒక్క యాప్ చేసే పనే ఇదంతా!

అయితే మండలిలో ప్రభుత్వ ఆరోపణలకు బలంగా సమాధానం ఇచ్చే క్రమంలో బొత్సలో ఒత్తిడి బాగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కు గురై ఉండొచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రాగా ఆయనకు వెంటనే అత్యవసర చికిత్సను వైద్యులు అందించినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు  స్పష్టం చేశాయి.

Advertisement

గతేడాది జూన్ లోనూ బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. 2025 జూన్ 4న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మాట్లాడూతున్న క్రమంలో స్పహకోల్పోయి కిందపడిపోయారు. దీంతో అక్కడున్న మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితర వైసీపీ నేతలు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. హై టెంపరేచర్ ఉండటం, మండుటెండలో కిలోమీటర్ కు పైగా నడిచి రావడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారని వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స అనంతరం బొత్స కోలుకోవడంతో వైసీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు.

Also Read: Telangana Endowments: తెలంగాణ దేవాదాయశాఖలో వింత పరిస్థితి.. 6నెలలుగా పెండింగ్‌లో కీలక ఫైళ్లు..!

Related News

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

Big Stories

Advertisement
×