E-Paper
Advertisement

Maoist Death: కంధమాల్ జిల్లాలో ఎన్ కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి..

Maoist Death: కంధమాల్ జిల్లాలో ఎన్ కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి..
Advertisement

Maoist Death: ఒడిశాలోని కంధమాల్ జిల్లా కాకేర్‌కుపా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన మావోయిస్టును ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దస్రుగా అధికారులు గుర్తించారు. ఆయన ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి చెందిన కంధమాల్- కలహండి- బౌధ్- నాయగర్ (KKBN) డివిజన్‌ కమిటీ సభ్యుడిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

దస్రుపై 5లక్షల రివార్డు సైతం తనపై ఉందిని తెలిపారు. భద్రతా దళాలపై దాడులు, అనేక సంఘటనలలో దస్రు పాల్గొనగా.. కంధమాల్‌, బౌద్‌ జిల్లాల్లో 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిశాలోని ఎలైట్ యాంటీ నక్సల్ ఆపరేషన్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అధికారి నేతృత్వంలో కంధమాల్ జిల్లా వాలంటరీ ఫోర్స్ కమాండోలతో కూడిన పోలీసు పార్టీ కాకేర్ కుపా ప్రాంతానికి వెళ్లగా.. అక్కడే ఎదురుకాల్పులు జరిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

Advertisement

ఈ కాల్పుల్లో ఓ పోలీస్‌ కూడా గాయపడ్డారని వెంటనే బెర్హంపూర్ పట్టణంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటన ప్రాంతంలో ఒక 303 రైఫిల్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Tags

Related News

వాహనదారులకు గుడ్‌న్యూస్.. టోల్‌ ప్లాజాల వద్ద ఆగకుండానే నేరుగా, ఫిబ్రవరి నుంచే అమల్లోకి!

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

Big Stories

Advertisement
×