BigTV English

Atishi Marlena Oath: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

Atishi Marlena Oath: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

Atishi Marlena Oath: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. అతిశీతో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఇటీవల కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అతిశీ ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో అతిశీని సీఎం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కేబినెట్‌లో ఏకైక మహిళగా, భారతదేశంలో ప్రస్తుత అతి చిన్న వయసులో సీఎంగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.


ఢిల్లీ విద్యా సంస్కరణలకు ఆమె నాయకత్వం వహించారు. ఢిల్లీ విద్యా రంగంలో తనైన ముద్ర వేశారు అతీశి.. ఆక్స్‌ఫర్డ్‌ నుంచి బలమైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. అనేక రాజకీయ విజయాలతో ముందుకు సాగారు. ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను మెరుగు పరచడానికి కృషి చేశారు. విద్యార్థుల హక్కులను సమర్థించారు. ప్రభుత్వ పోర్ట్‌ఫోలియేలను నిర్వహించారు.

Also Read: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం


జూన్‌ 8 19981లో అతిశీ జన్మించారు. అతిశీ తల్లిదండ్రులు విజయ్‌ సింగ్‌, త్రిపతా వాహి ఇద్దరూ ఢిల్లీ యూనివర్సిటీలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఆమె తన పాఠశాల విద్యను న్యూ ఢిల్లీలోని స్రింగ్‌డేల్స్‌ స్కూల్‌లో పూర్తి చేసింది. 2001లో సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజ్‌, న్యూఢిల్లీ నుంచి చరిత్రలో పట్టభద్రురాలైంది. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చేరింది. అక్కడి నుంచి 2003లో చవెనింగ్‌ స్కాలర్‌ షిప్‌పై తన మొదటి మాస్టర్‌ డిగ్రీని పొందింది. 2005లో ఆమె రోడ్స్‌ స్కాలర్‌గా ఎడ్యుకేషన్‌లో రీసెర్చ్‌ లో రెండో మాస్టర్‌సాధించింది.

2013లో ఆమ్‌ ఆద్మీ పార్టీలో అతిశీ చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో క్రీయాశీలంగా వ్యవహరించారు. అవినీతికి వ్యతిరేకంగా ఆమె పోరాటాలు చేశారు. మధ్య ప్రదేశ్‌లో జల్‌ సత్యాగ్రహం వంటి కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకున్నారు. 2019లో ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. గౌతమ్‌ గంభీర్‌ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీలో పోటీ చేసి 11 వేల ఓట్లతో ప్రత్యర్థిపై గెలుపొందారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×