E-Paper
Advertisement

Breaking: అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ యువకుడు హల్‌చల్, టెంపుల్‌లో నమాజ్ చదువుతుండగా..?

Breaking: అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ యువకుడు హల్‌చల్, టెంపుల్‌లో నమాజ్ చదువుతుండగా..?
Advertisement

అయోధ్యలోని ప్రతిష్ఠాత్మక రామ మందిర ప్రాంగణంలో శనివారం ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కశ్మీర్‌కు చెందిన ఒక యువకుడు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి హల్చల్ సృష్టించాడు. నిందితుడిని కశ్మీర్ నివాసి అహ్మద్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. పోలీస్ సెక్యూరిటీని దాటుకుని లోపలికి వెళ్లిన ఈ యువకుడు, అక్కడ నమాజ్ చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం.

ఆలయ భద్రతా సిబ్బంది, అక్కడున్న భక్తులు యువకుడి ప్రవర్తనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అయోధ్య పోలీసులు అహ్మద్ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించాడన్న ఆరోపణలతో అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అతడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

Advertisement

అసలు ఆ యువకుడు అయోధ్యకు ఎందుకు వచ్చాడు..? ఆలయంలో నమాజ్ చేయడానికి గల కారణాలేంటి? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అయోధ్య వంటి భక్త పరవశమైన ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

ALSO READ: BRS : జాబ్ క్యాలెండర్ పంచాయితీ.. బీఆర్ఎస్‌కు మంత్రి మాస్టర్ స్ట్రోక్!

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×