E-Paper
Advertisement

లాడ్జి బాత్రూంలో యువతి మృతదేహం.. ఇద్దరు యువకులు పరార్, బెంగుళూరు సమీపంలో ఘటన

లాడ్జి బాత్రూంలో యువతి మృతదేహం.. ఇద్దరు యువకులు పరార్, బెంగుళూరు సమీపంలో ఘటన
Advertisement

Bengaluru: కారణాలు ఏంటో తెలీదు. 23 ఏళ్ల యువతి అనుమానాస్పదంగా బాత్రూమ్‌లో మృతి చెందింది. బెంగుళూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆ యువతితో వచ్చిన ఇద్దరు యువకులు కనిపించకుండా పోయారు. దీంతో వారిపై అనుమానాలు రెట్టింపు అయ్యాయి. అసలు ఏం జరిగింది? మృతురాలు ఏ ప్రాంతానికి చెందినది? ఇం కాస్త లోతుల్లోకి వెళ్తే..

బెంగుళూరు యువతి, లాడ్జ్‌లో శవమైంది

బెంగళూరులోని చిక్కబనవరకు చెందిన 23 ఏళ్ల యువతి వర్ష మృతిపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. హాసన్ జిల్లా సకలేష్‌పూర్ తాలూకాలో ఓ లాడ్జిలో శవమై తేలింది. ఈ కేసు ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. వర్షతోపాటు ఇద్దరు యువకులు హాసన్‌లోని సకలేష్‌పూర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ముగ్గురు లాడ్జ్‌లో బస చేయడానికి ముందు ఆ ప్రాంతంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించినట్లు సమాచారం.

ఇద్దరు యువకులతో హాసన్ జిల్లాకు యువతి పయనం

Advertisement

శుక్రవారం మృతురాలితో పాటు యువకులిద్దరు శ్రీదేవు లాడ్జ్‌లో ఓ గదిని బుక్ చేసుకున్నారు. మరుసటిరోజు ఆ యువతి బాత్రూంలో మృతదేహం కనిపించింది. యువతితో వచ్చిన ఇద్దరు యువకులు అదృశ్యమయ్యారు. ఆమె లాడ్జి డోర్ ఎంతకూ ఓపెన్ చేయకపోవడంతో సిబ్బంది అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఈ విషయం చెప్పారు. ఘటనా స్థలానికి వెళ్లి అన్నీ పరిశీలించారు. యువతితోపాటు ఎంతమంది యువకులు వచ్చారు? ఎప్పుడు చెక్ ఇన్ అయ్యారు? అనేదానిపై వివరాలు తీసుకున్నారు. లాడ్జిలో సీసీ ఫుటేజ్ పరిశీలించారు. పరారీలో యువకుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

పోలీసుల అదుపులో యువకులు, ఏం జరిగింది?

ఆ యువతిని ఆ యువకులు ఏమైనా చేశారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. యువతి పేరు వర్ష కాగా, ఆమె స్వస్థలం చిక్కబనవర. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. రాత్రి ఆ లాడ్జిలో ఏం జరిగింది? అనేది మిస్టరీగా మారింది. పారిపోయిన ఇద్దరు యువకులు ఎవరు? అనేదానిపై ఆరా తీస్తున్నారు. ఆమెతో పాటు ఉన్న ఇద్దరు యువకులు ఆమె స్నేహితులని సమాచారం. సకలేష్‌పూర్ హాస్పిటల్ మార్చురీలో ఉంచిన మృతదేహాన్ని.. పోస్ట్‌మార్టం పరీక్ష కోసం హాసన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ లాడ్జ్‌లో బస చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అనుమతి లేకుండా ఆ లాడ్జ్‌ను నడుపుతున్నారని స్థానికులు ఆరోపించారు.

Advertisement

ALSO READ: ఇదేందయ్యా ఇది.. 21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి.. వీడియో వైరల్

Related News

ఇదేందయ్యా ఇది.. 21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి.. వీడియో వైరల్

రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన కారు.. గాల్లోకి ఎరిగిన వ్యక్తి, హిట్ అండ్ రన్‌లో షాకింగ్ దృశ్యాలు

రైల్వే జాబ్స్.. 7వ పే కమిషన్ జీతంతో 560 ఉద్యోగాలు

45 ఏళ్ల క్రితం నాటి దొంగను పట్టించిన ఏఐ ఫోటో.. ఎలానో తెలిస్తే మీరు షాకవ్వడం కాయం!

ప్రధాని మోదీ జన్మదిన వేళ ఎంపీ డీకే అరుణ సంచలన పిలుపు!

యూపీఐ ఉచిత సేవలకి ఎండ్ కార్డ్? మోదీ సర్కార్ నిర్ణయంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

24 క్యారెట్ల బంగారు పూతతో.. గణపయ్యకు కుడుములు.. కేజీ ఏకంగా రూ.27,000 బాబోయ్!

Big Stories

Advertisement
×