Indiramma Sewing: స్వేచ్చ బ్యూరో: బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం”కు దరఖాస్తుల స్వీకరణ గడువును 30 సెప్టెంబర్ 2026వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1.19 లక్షల మంది అర్హులైన బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 2026 సెప్టెంబర్ 30వ తేదీలోగా TGOBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
Also read: నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన
బీసీ మహిళలకు ఇంటి నుంచే స్వయం ఉపాధి పొందే అవకాశాలను కల్పించడం, తద్వారా వారి కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించి ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు. పథకానికి సంబంధించిన సమాచారం అర్హులైన ప్రతి మహిళకు చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించి, అర్హులైన వారందరూ గడువులోగా దరఖాస్తు చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు.
Also read: షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల కోసం UPI ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా? కొత్త MDR రూల్స్ ఇవే