E-Paper
Advertisement

24 క్యారెట్ల బంగారు పూతతో.. గణపయ్యకు కుడుములు.. కేజీ ఏకంగా రూ.27,000 బాబోయ్!

24 క్యారెట్ల బంగారు పూతతో.. గణపయ్యకు కుడుములు.. కేజీ ఏకంగా రూ.27,000 బాబోయ్!
Advertisement

Gold Modak: దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో 10 రోజుల పాటు ఈ వేడుకలు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంబురాల వైభవాన్ని మరింత పెంచుతూ నాసిక్‌లోని ప్రముఖ స్వీట్ షాపు వినూత్న ఆలోచన చేసింది. గణనాథుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కుడుముల (మోదక్)ను 24 క్యారెట్ల పసిడితో తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

కేజీ రూ.27,000 మాత్రమే..

నాసిక్‌లోని విద్యా వికాస్ సర్కిల్ వద్ద ఉన్న ‘సాగర్ స్వీట్స్’.. తింటే కరిగిపోయే 24 క్యారెట్స్ బంగారు పూతతో కుడుములు తయారు చేసింది. ఈ ‘గోల్డెన్ మోదక్’ ధర కిలో రూ. 27,000 కావడం విశేషం. ఇతర తీపి పదార్థాలతో పోలిస్తే.. దీని లుక్ చాలా గ్రాండ్ కనిపిస్తుండటం కస్టమర్లను ఆకట్టుకుంటోంది. వినాయక చవితిని దృష్టిలో ఉంచుకొని మెుత్తం 25 రకాల మోదక్ లను స్వీట్స్ షాపు అందుబాటులో ఉంచగా.. బంగారు పూత కలిగిన కుడుములు వాటిలో హైలెట్ గా నిలుస్తున్నాయి. ఈ మోదక్ లకు బంగారంతో పాటు వెండి పూత కూడా పూసి అందంగా తీర్చిదిద్దడం గమనార్హం.

Advertisement

చవితిలో కుడుముల విశిష్టత

గణేష్ చతుర్థి పూజల్లో కుడుములు అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది. పురాణాల ప్రకారం కూడా కుడుములు.. విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రియమైన నైవేధ్యం. అందుకే మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు కొబ్బరి పూర్ణంతో చేసే సాంప్రదాయ మోదక్‌లతో పాటు చాక్లెట్ మోదక్, డ్రై ఫ్రూట్స్ మోదక్ వంటి రకరకాల తీపి పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆశీస్సులు పొందుతుంటారు. ఈ క్రమంలోనే వ్యాపారులు మోదక్ లపై సరికొత్త ప్రయోగాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. ఐఫోన్ ధరలు తగ్గుతాయా? లేక షాక్ ఇస్తాయా? పూర్తి విశ్లేషణ!

దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు

అటు గణేష్ చతుర్థి వేడుకలు మహారాష్ట్రతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు తమ ఇళ్లల్లో, మండపాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. నిత్యహారతులు, భజనలు, భక్తి గీతాలతో మండపాలను హోరెత్తిస్తున్నారు. ఇక చివరి రోజున ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించే నిమజ్జన కార్యక్రమం.. ఈ వేడుకల్లోనే హైలెట్ గా నిలుస్తాయి.

Also Read: రోజూ 2GB డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ ఫ్రీ.. Jio కొత్త రీఛార్జ్ ప్లాన్ చూశారా?

Tags

Related News

యూపీఐ ఉచిత సేవలకి ఎండ్ కార్డ్? మోదీ సర్కార్ నిర్ణయంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

డిజిటల్ చెల్లింపులపై కొత్త టాక్స్.. సామాన్యుడికి మోదీ సర్కార్ దెబ్బ!

ఓ వైపు చీప్ పబ్లిసిటీ.. మరోవైపు ఘనంగా వేడుకలు.. తమిళనాట గణేశ్ ఉత్సవాలు అదరహో!

బిచ్చగాడిగా మారిన ఎమ్మెల్యే పరాగ్.. వేల కోట్లకు అధిపతి, అసలు కారణమేంటి?

పబ్లిసిటీకి వెళ్లాడు.. హోటల్ ఓనర్ అరెస్ట్, బిర్యానీ ప్రకటనలో గణేశుడు

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

చైన్ స్నాచర్ల ఆటకట్టించిన రియల్ హీరో.. వృద్ధ దంపతులను కాపాడిన దృశ్యాలు వైరల్!

Big Stories

Advertisement
×