E-Paper
Advertisement

తల్లి కాబోతున్న సీరియల్ నటి లావణ్య.. ఘనంగా సీమంతం వేడుకలు!

తల్లి కాబోతున్న సీరియల్ నటి లావణ్య.. ఘనంగా సీమంతం వేడుకలు!
Advertisement

Actress Lavanya bhardwaj: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు చిన్న కోడలు ‘ప్రేమ’ పాత్రను పోషించిన లావణ్య భరద్వాజ్ (Lavanya bhardwaj) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తనదైన చలాకీ నటనతో ఆకట్టుకుంటున్న ఈమె స్వతహాగా కన్నడ అమ్మాయి.. అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఆదరణ అందుకుంటుంది. ఇకపోతే ఏప్రిల్ నెలలో సడన్గా సీరియల్ నుండి తప్పుకుంటూ అసలు విషయాన్ని చెప్పి అందరిని సర్ప్రైజ్ చేసింది. సినిమాటిక్ లెవెల్ లో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని రివీల్ చేస్తూ తన భర్త శశి హెగ్డే తో కలిసి ఒక వీడియోని షేర్ చేసింది.”చిన్నారితో మా ప్రేమ కథ కొనసాగుతూనే ఉంటుంది” అంటూ అభిమానులకు శుభవార్త తెలిపింది..

ఘనంగా లావణ్య సీమంతం వేడుకలు..

అలాంటి లావణ్య భరద్వాజ్ కి ఆమె భర్త శశి హెగ్డే దగ్గరుండి మరీ సీమంతం వేడుకలను జరిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో లావణ్య, శశి దంపతులకు నటీనటులు, అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే తాజాగా జరిగిన లావణ్య సీమంతం వేడుకలలో పలువురు సీరియల్ సెలబ్రిటీలు సందడి చేశారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ సీమంతం వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.

లావణ్య రియల్ లైఫ్..

Advertisement

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. తెలుగులో శశిరేఖ పరిణయం వంటి టాప్ సీరియల్ లో నటించి తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన ఈమె.. శ్రీరస్తు శుభమస్తు సీరియల్ లో కూడా నటించింది. ఇక ఇల్లు ఇల్లాలు ప్రియురాలు సీరియల్లో నటిస్తున్న సమయంలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడంతో సీరియల్ నుండి తప్పుకుంది.ఇప్పుడు సీమంతం వేడుకతో అభిమానులను సర్ప్రైజ్ చేసింది.. ఇకపోతే కన్నడ సీరియల్ లో నటిస్తున్న సమయంలోనే తన సహ నటుడైన శశి హెగ్డే ను ప్రేమించి, పెద్దలను ఒప్పించి 2022లో పెళ్లి చేసుకుంది.

హీరోయిన్ గానే కాదు విలన్ షేడ్స్ లో కూడా..

ఇకపోతే సీరియల్స్ లో హీరోయిన్ గానే కాకుండా నెగటివ్ షేడ్స్ లో కూడా నటిస్తూ, మెప్పిస్తూ వర్సటైల్ నటిగా పేరు సొంతం చేసుకుంది. శశిరేఖ పరిణయం సీరియల్లో కీలకపాత్ర పోషించిన ఈమె.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె చూపించే పగ , ప్రతీకారం, డైలాగు డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Advertisement

ALSO READ: 10 ఏళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కిన నటి అహానా కృష్ణ.. వరుడు ఎవరంటే?

లావణ్య రెమ్యూనరేషన్..

సీరియల్స్ తో బిజీగా ఉన్న ఈమె తనకున్న క్రేజ్ , స్క్రీన్ టైమింగ్ ను బట్టి రోజు వారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రోజుకి రూ.15, 000 నుండి రూ.25 వేల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు రీల్స్ చేస్తూ సందడి చేసే ఈమె ట్రెండింగ్ పాటలకు డాన్స్ చేయడం, షూటింగ్ లోకేషన్ విషయాలను అభిమానులతో పంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది. సీరియల్స్ తోనే తన కెరియర్ను పరిమితం చేయకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.

Related News

సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

దేబ్జానీ.. ముఖేష్ తో ప్రేమ నిజమేనా?

Gundeninda Gudigantalu Neethu : నీతూ ఇన్ని రోజులు ఏమైంది..? అసలు మ్యాటర్ ఇదేనా..?

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. కానీ- ఉదయభాను

బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న చరణ్, చైత్ర.. వీడియో వైరల్!

పెద్దోడి డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వీడియో వైరల్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 16th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మలో ప్రవేశించనున్న ఆరు ఆత్మ..?  

Big Stories

Advertisement
×